అనిరుధ్‌తో కీర్తి సురేష్‌ పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన తండ్రి | Keerthy Suresh And Anirudh Wedding Rumors React Father | Sakshi
Sakshi News home page

Keerthy Suresh: అనిరుధ్‌తో కీర్తి సురేష్‌ పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన తండ్రి

Published Sun, Sep 17 2023 9:19 AM | Last Updated on Sun, Sep 17 2023 11:24 AM

Keerthy Suresh And Anirudh Wedding Rumors React Father - Sakshi

మలయాళ నటి మేనక కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన కీర్తి సురేష్ అతి తక్కువ కాలంలోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా సౌత్‌ ఇండియాలో నిలదొక్కుకుంది. సావిత్రి బయోపిక్‌ మహానటిలో ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఆ సినిమాతో కీర్తి సురేష్‌ జాతీయ అవార్డు అందుకుంది. కానీ ఆమెకు ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడటం లేదు. కానీ కీర్తి పెళ్లిపై మరోసారి రూమర్స్‌ రావడం జరుగుతోంది. గతంలో కూడా అనేకసార్లు ఇలాంటి రూమర్స్‌ వచ్చాయి. కాలక్రమంలో అవన్నీ అబద్ధమని కూడా తేలింది.  ఈసారి, ఆమె ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో కలిసి ఉన్నట్లు పుకార్లు వ్యాపించాయి. 

స్పందించిన కీర్తి సురేష్‌ తండ్రి
అనిరుధ్ రవిచందర్‌తో ఆమె పెళ్లి పుకార్లపై కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ ఇలా స్పందించారు. ' కీర్తి- అనిరుధ్‌పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆ ప్రచారాలు అన్నీ నిరాధారమైనవి, వాటిలో ఏ మాత్రం కూడా నిజం లేదు. కీర్తి గురించి ఇలాంటి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే ఇలాంటివి చాలానే ఉన్నాయి. తాజాగా కీర్తి, అనిరుధ్ గురించి ఎవరో కావాలనే  ఒక వార్తను క్రియేట్‌ చేసి ఇలా తప్పుగా ప్రచారం చేస్తున్నారు.' అని ఆయన అన్నారు. ఇదే సమయంలో కీర్తి సురేష్ కూడా అనిరుధ్‌తో పెళ్లి పుకార్లను ఖండించింది. టైమ్స్ నౌతో ఆమె మాట్లాడుతూ.. అది తప్పుడు వార్త అని అనిరుధ్ నాకు మంచి స్నేహితుడు మాత్రమేనని తెలిపింది. 

పెళ్లి రూమర్స్‌ ఎందుకు వచ్చాయ్‌
అయితే, కీర్తి సురేష్, అనిరుధ్ రవిచందర్ పెళ్లిపై పుకార్లు రావడం ఇది మొదటిసారి కాదని గమనించాలి. రెమో (శివ కార్తికేయ), గ్యాంగ్‌ (సూర్య), అజ్ఞాతవాసి వంటి మరెన్నో చిత్రాల కోసం కీర్తి, అనిరుధ్ కలిసి పనిచేశారు. వీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని కూడా అంటారు. ఇటీవల ఆమె జవాన్‌లోని అనిరుద్ బ్లాక్ బస్టర్ సాంగ్ చలేయా.. పాటకు డైరెక్టర్‌ అట్లీ భార్య కృష్ణ ప్రియతో కలిసి డ్యాన్స్ కూడా చేసింది. అది కూడా భారీగా వైరల్ అయింది.

దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్తతో కీర్తి సురేష్ పెళ్లి పుకార్లు
కొన్ని నెలల క్రితం దుబాయ్‌కి చెందిన ఫర్హాన్ అనే వ్యాపారవేత్తతో కీర్తి సురుష్‌ సంబంధంలో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. ఆమె సోషల్ మీడియాలో ఒక ఫోటోను పోస్ట్ చేయడంతో పెళ్లి పుకార్లకు ఆజ్యం పోసింది. అయితే, ఈ వార్త వైరల్ కావడంతో, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి తన స్నేహితుడని ఆమె స్పష్టం చేసింది. ఆ సమయంలో ఆమె తండ్రి కూడా ఈ వార్తలను తిప్పికొట్టిన విషయం తెలిసిందే.  కానీ ఆమె మరోకరితో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. త్వరలో తన మిస్టరీ మ్యాన్ గురించి చెప్తానని వెల్లడించింది.

(ఇదీ దచవండి: శ్రావణ భార్గవికి రెండో పెళ్లా..? హల్దీ ఫంక్షన్‌ ఫోటోలు వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement