
నటి కీర్తీ సురేష్‌ను లక్కీ హీరోయిన్‌గా పేర్కొనవచ్చు. బాల నటిగా రంగ ప్రవేశం చేసిన ఈమె ఆ తర్వాత కథానాయకిగా మాతృభాషలో పరిచయమైనా, ఆ వెంటనే కోలీవుడ్, టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టేశారు. అలా చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అంతస్తును పొందారు. అంతేకాదు అతి తక్కువ వయసులోనే జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఆపై బేబీ జాన్ చిత్రంతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. కోలీవుడ్ దర్శకుడు అట్లీ నిర్మించిన ఈ చిత్రం అక్కడ ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ఇటీవలే ఓటీటీలో విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తుండటం విశేషం. అలా పాన్ ఇండియా కథానాయకిగా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ 32 ఏళ్ల వయసులో పెళ్లి కూడా చేసుకున్నారు.
గత ఏడాది డిసెంబర్ 12వ తేదీన తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనినీ కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తన వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేష్ హిందీ చిత్రం బేబీ జాన్ తర్వాత మరో కొత్త చిత్రాన్ని అంగీకరించలేదు. అలాంటిది తాజాగా కీర్తి సురేష్ కమ్‌బ్యాక్‌కు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

తమిళంలో యువ కథానాయకుడిగా రాణిస్తున్న అశోక్ సెల్వన్‌కు జంటగా నటించడానికి ఈ భామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ మూవీని ఇంతకుముందు గుడ్ నైట్, లవర్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన మిలియన్ డాలర్ స్టూడియోస్ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో కన్నె వేడి, రివాల్వర్ రీటా చిత్రాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment