
Was Anchor Sreemukhi Already Got Married Here Is The Proof: యాంకర్ శ్రీముఖి.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన ముద్దు ముద్దు మాటలతో పాటు ఆకర్షించే అందం, అల్లరితో ప్రేక్షకులను ఎంతగానే అలరిస్తూ వస్తుంది. ప్రోగ్రామ్ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు. తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంది. బుల్లితెరపై ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు పెళ్లి ఎప్పుడు అవుతుందో తెలుసుకుందామని ఫన్నీ గేమ్ ఆడింది. ఇందులో నాకు పెళ్లి ఎప్పుడు అవుతుంది అంటూ శ్రీముఖి అడగ్గానే.... మీకు ఇదివరకే పెళ్లయిందంటూ సమాధానం వచ్చింది. ఇది చూసి షాక్ అయిన శ్రీముఖి తొక్కా అంటూ రియాక్షన్ ఇచ్చింది.
మొదట్లో నవ మన్మథుడా..అతి సుందరుడా నను వలచిన ఆ ప్రియుడు అంటూ ఎంతో హుషారుగా గేమ్ మొదలు పెట్టిన శ్రీముఖికి ఇన్‌స్టాగ్రామ్ ఊహించని షాక్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇదిచూసిన నెటిజన్లు...ఇన్‌స్టాగ్రామ్ రాక్స్..శ్రీముఖి షాక్స్ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.