
కొల్‌కత్తా: ప్రముఖ బెంగాలీ దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ వివాహం నిరాడంబరంగా శుక్రవారం జరిగింది. ఆయన బంగ్లాదేశ్‌కు చెందిన నటి, మోడల్ రఫియాత్ రషీద్ మిథిలాని వివాహమాడారు. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులైన బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు రుద్రనీల్ ఘోష్, జిషు సేన్‌గుప్తా, కవి శ్రీజాటోలు పాల్గొన్నారు. వివాహమహోత్సవంలో మిథాలా ఎరుపు జమ్దానీ చీరలో, శ్రీజిత్ నల్లపు రంగు కుర్తా, నెహ్రూ జాకెట్‌లో మెరిసిపోయారు. మిథిలా బ్రాక్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా చిన్నపిల్లలకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
మిథిలా గతంలో బంగ్లాదేశ్‌కి చెందిన సంగీతకారుడు తహ్సాన్ రెహ్మాన్ ఖాన్‌ను 2006లో వివాహం చేసుకుంది. అనంతరం 2017లో వీరు చట్టప్రకారం విడిపోయారు. వారికి ఓ కూతురు కూడా ఉన్నారు. కాగా ఇటీవల శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో భారత స్వాతంత్ర్య వీరుడు సుభాస్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన అంశంపై ‘గుమ్నామి’ అనే చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటుడు ప్రొసేన్‌జిత్ ఛటర్జీ.. సుభాస్ చంద్రబోస్ పాత్రలో కనిపించారు.
కూతురుతో మిథిలా,శ్రీజిత్ ముఖర్జీ