srijith Mukharji
-
బంగ్లా నటితో దర్శకుడి వివాహం
కొల్కత్తా: ప్రముఖ బెంగాలీ దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ వివాహం నిరాడంబరంగా శుక్రవారం జరిగింది. ఆయన బంగ్లాదేశ్‌కు చెందిన నటి, మోడల్ రఫియాత్ రషీద్ మిథిలాని వివాహమాడారు. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులైన బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు రుద్రనీల్ ఘోష్, జిషు సేన్‌గుప్తా, కవి శ్రీజాటోలు పాల్గొన్నారు. వివాహమహోత్సవంలో మిథాలా ఎరుపు జమ్దానీ చీరలో, శ్రీజిత్ నల్లపు రంగు కుర్తా, నెహ్రూ జాకెట్లో మెరిసిపోయారు. మిథిలా బ్రాక్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా చిన్నపిల్లలకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మిథిలా గతంలో బంగ్లాదేశ్‌కి చెందిన సంగీతకారుడు తహ్సాన్ రెహ్మాన్ ఖాన్‌ను 2006లో వివాహం చేసుకుంది. అనంతరం 2017లో వీరు చట్టప్రకారం విడిపోయారు. వారికి ఓ కూతురు కూడా ఉన్నారు. కాగా ఇటీవల శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో భారత స్వాతంత్ర్య వీరుడు సుభాస్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన అంశంపై ‘గుమ్నామి’ అనే చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటుడు ప్రొసేన్‌జిత్ ఛటర్జీ.. సుభాస్ చంద్రబోస్ పాత్రలో కనిపించారు. కూతురుతో మిథిలా,శ్రీజిత్ ముఖర్జీ -
మరో అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్.. బేగంజాన్
-
మరో అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్.. బేగంజాన్
బాలీవుడ్లో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్న విద్యాబాలన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న చిత్రం బేగం జాన్. దేశ విభజన సమయంలో వేశ్యలుగా మారిన బెంగాలీల జీవితం ఇతివృత్తాంతంగా ఈ సినిమా రూపొందుతోంది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో బెంగాలీ మూవీ రాజ్‌కహిని ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వేశ్యా గృహానికి చెందిన 11 మంది మహిళల జీవిత విశేషాలే బేగం జాన్. ఆ సమయంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా ఎదుర్కొన్న ఓ మహిళ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు . విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మరో వేశ్యగా గౌహర్ ఖాన్ నటించింది. మరోసారి అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది విద్యా. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రయూనిట్ సమక్షంలో ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతోంది. -
'బేగం జాన్' ఫస్ట్ లుక్
బాలీవుడ్లో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్న విద్యాబాలన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న చిత్రం బేగం జాన్. దేశ విభజన సమయంలో వేశ్యలుగా మారిన బెంగాలీల జీవితం ఇతివృత్తాంతంగా ఈ సినిమా రూపొందుతోంది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో బెంగాలీ మూవీ రాజ్‌కహిని ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వేశ్యా గృహానికి చెందిన 11 మంది మహిళల జీవిత విశేసాలే బేగం జాన్. ఆ సమయంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా ఎదుర్కొన్న ఓ మహిళ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు . విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మరో వేశ్యగా గౌహర్ ఖాన్ నటించింది. ఇప్పటికే ఆన్ లైన్లో లీక్ అయిన బేగం జాన్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో తాజాగా చిత్రయూనిట్ అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతోంది.