మరో అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్.. బేగంజాన్ | Vidya Balan Begum Jaan Trailer | Sakshi
Sakshi News home page

మరో అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్.. బేగంజాన్

Mar 14 2017 4:10 PM | Updated on Sep 5 2017 6:04 AM

మరో అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్.. బేగంజాన్

మరో అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్.. బేగంజాన్

బాలీవుడ్లో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్న విద్యాబాలన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న చిత్రం బేగం జాన్. దేశ విభజన

బాలీవుడ్లో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్న విద్యాబాలన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న చిత్రం బేగం జాన్. దేశ విభజన సమయంలో వేశ్యలుగా మారిన బెంగాలీల జీవితం ఇతివృత్తాంతంగా ఈ సినిమా రూపొందుతోంది. శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకత్వంలో  బెంగాలీ మూవీ రాజ్‌కహిని ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వేశ్యా గృహానికి చెందిన 11 మంది మహిళల జీవిత విశేషాలే బేగం జాన్‌. ఆ సమయంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా ఎదుర్కొన్న ఓ మహిళ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు .

విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మరో వేశ్యగా గౌహర్ ఖాన్ నటించింది. మరోసారి అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది విద్యా. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రయూనిట్ సమక్షంలో ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ను లాంచ్ చేశారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement