మరో బాలీవుడ్ మూవీపై బ్యాన్..! | Vidya balan begum Jaan Banned in Pakistan | Sakshi
Sakshi News home page

మరో బాలీవుడ్ మూవీపై బ్యాన్..!

Apr 15 2017 12:25 PM | Updated on Sep 5 2017 8:51 AM

మరో బాలీవుడ్ మూవీపై బ్యాన్..!

మరో బాలీవుడ్ మూవీపై బ్యాన్..!

బాలీవుడ్ సినిమాలు పాకిస్తాన్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తుంటాయి. ముఖ్యంగా బాలీవుడ్ ఖాన్ ల సినిమాలకు పాక్ లో

బాలీవుడ్ సినిమాలు పాకిస్తాన్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తుంటాయి. ముఖ్యంగా బాలీవుడ్ ఖాన్ ల సినిమాలకు పాక్ లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఇటీవల కాలం పాకిస్తాన్ సెన్సార్ బోర్డ్ చర్యల మూలంగా చాలా వరకు మన సినిమాలు పాక్ ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి. ముఖ్యంగా దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కే సినిమాలను పాక్ తమ దేశంలో ప్రదర్శించేందుకు అనుమతించదు.

అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన దంగల్ సినిమాను కూడా భారతజాతీయం గీతం ఉందన్న కారణంతో పాక్ లో ప్రదర్శించేందుకు నిరాకరించింది. అయితే తాజాగా మరో సినిమాకు ఇదే పరిస్థితి ఎదురైంది. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బేగం జాన్ సినిమాపై పాక్ సెన్సార్ బోర్డ్ నిషేదం విధించింది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో మహేష్ భట్ నిర్మించిన ఈ సినిమాలో అభ్యంతరపెట్టాల్సిన అంశాలేవి లేవని, అయినా పాక్ నిషేదం విధించటం బాధాకరమని చిత్రయూనిట్ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement