
బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ అందరికీ తెలిసే ఉంటుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘ది డర్టీ పిక్చర్’తో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాతో విద్యా బాలన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. హానీ మూవీతో తనెంటో నిరూపించుకుంది విద్యా బాలన్ అప్పటి నుంచి వరసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. విద్యా బాలన్ సినిమా కెరీర్ గురించి అందరికీ తెలిసినా ఆమె వ్యక్తిగత విషయాలు చాలా వరకూ బయటకు తెలీదు.
కళ్ల అభినయంతో నటలో నూటికి నూరు మార్కులు కొట్టేసిన విద్యాబాలన్ ఓ ఇంటర్యూ తన కళ్ల అందం వెనుక దాగున్న రహస్యం గురించి, అందుకోసం తాను వాడే కాజల్ గురించి పంచుకుంది. నవరసనటసార్వభౌమురాలు విద్యాబాలన్ కళ్లకు కాటుక పెట్టందే గడప దాటదు. అది సాదాసీదా కాటుక కాదు.. పాకిస్తానీ పాపులర్ బ్రాండ్ ‘హష్మీ’ కాజల్. తన మీద అదృష్టం దృష్టిపడ్డానికి.. సక్సెస్ తన కెరీర్ అడ్రస్‌గా మారడానికి ఆ కాజలే కారణం అని విద్యాబాలన్ బలంగా నమ్ముతుందని బాలీవుడ్ వర్గాల భోగట్టా!
(చదవండి: పార్లర్‌కి వెళ్లక్కర్లేకుండా..ఈ మెషిన్‌తో ఈజీగా వ్యాక్సింగ్, థ్రెడింగ్..)
Comments
Please login to add a commentAdd a comment