పుష్ప మూవీలో హీరో అన్నట్లు వర్క్‌లో బ్రాండ్‌ కావాలి..! | Pak Woman Her Job Interview Rejection Turned Into Career Insight | Sakshi
Sakshi News home page

పుష్ప మూవీలో హీరో అన్నట్లు వర్క్‌లో బ్రాండ్‌ కావాలి..!

Published Wed, Feb 5 2025 11:45 AM | Last Updated on Wed, Feb 5 2025 1:24 PM

Pak Woman Her Job Interview Rejection Turned Into Career Insight

పుష్ప మూవీ హీరో అల్లు అర్జున్‌కి ఇంటి పేరు ఏంటి, తండ్రి ఎవరు అనే రెండు డైలాగులు ఫైర్‌ అయ్యేలా చేసే బలహీనతలు. ఆ బలహీనతపైనే విలన్‌ దెబ్బకొడుతుంటే..నో పుష్ప​గాడు అంటే ప్లవర్‌ కాదు అదో బ్రాండ్‌ అని ప్రూవ్‌ చేస్తాడు. ఈ మూవీలోని డైలాగ్‌లా ప్రతి వ్యక్తి బ్రాండ్‌లా ఉండాలి. అంటే వర్క్‌ పరంగా లేదా దేనిలోనైనా మన ముద్ర ఉండేలా చూసుకోవాలి. ఏదో ఇతరులకి హెల్ప్‌ చేసి మంచివాళ్లు అనిపించుకునే నేమ్‌ అవసరం లేదు. 

మనల్ని చూడగానే ఈ వర్క్‌లో అతడికి మించి తోపులేరు అనే బ్రాండ్‌ సెట్‌ చేసుకోవాలట. అప్పుడే మనకు ఎందులోనూ తిరుగుండదని చెబుతోంది ఒక పాకిస్తాన్‌ మహిళ. ఆమెకు ఉద్యోగం రాకపోవడమే కెరీర్‌పై సరైన దృక్పథం ఏర్పడేలా చేసిందట. ఆ ఇంటర్యూలో సీఈవో అడిగిన ఒక్క ప్రశ్న తన ఉనికినే కాదు ప్రతి ఒక్కరికి కావాల్సింది కూడా ఇదే అంటూ తన అనుభవాన్ని షేర్‌ చేసుకుంది..

ఇంతకీ ఆమె ఏం చెబుతుందంటే..పాకిస్తాన్‌కి చెందిన హిబా హనీఫ్ అనే మహాళ తాను ఫేస్‌ చేసిన ఇంటర్వ్యూ అనుభవాన్ని సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంది. ఆ ఇంటర్వ్యూలో ఆమె ఫెయిల్యూర్‌ అయినా.. ఆ కంపెనీ సీఈవో అడిగిన ఒక్క ప్రశ్న తన దృక్పథాన్నే మార్చేసిందని చెప్పారు. తాను సోషల్‌మీడియా మేనేజ్‌మెంట్‌ పోస్ట్‌ ఇంటర్వ్యూ కోసం అని ఒక కంపెనికి వెళ్లినట్లు తెలిపింది. 

"అక్కడ తనతోపాటు ముగ్గురు ఫైనల్‌ రౌండ్‌కి రాగా, ముగ్గుర్ని విడివిడిగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. సోషల్‌ మీడియా మేనేజర్‌గా తమకున్న వ్యూహాలు, నైపుణ్యాల గురించి క్లిష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారు. వాటికి ధీటుగా చెపపేలా తమ వద్ద స్కిల్స్‌ ఉన్నాయా లేదా అనేది వారి టెస్ట్‌..అని చెప్పుకొచ్చారు" హనీఫ్‌. 

అయితే తాను ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్‌ కాలేదు కానీ ఆ కంపెనీ సీఈవో అడిగిన ప్రశ్న తాను ఎలా ఉంటే కెరీర్‌ బాగుంటుందన్నది తెలియజేసిందని చెబుతోంది. నైపుణ్యాల, మరింత ఇంటిలిజెన్స్‌ అంటూ కోచింగ్‌ సెంటర్లకి పరిగెడుతుంటాం కానీ కావాల్సింది అది కాదు నువ్వు ఈ పనిలో బ్రాండ్‌ అనేలా మన ముద్ర ఉండాలి. అదే ఏ సంస్థకైనా కావాల్సిన స్కిల్‌ అని చెప్పడంతో.. ఇన్నాళ్లు తన గుర్తింపు ఏంటన్నది ఆలోచించలేకపోయానా..! అనేది గుర్తించానంటూ నాటి ఇంటర్యూని గుర్తుచేసుకున్నారామె. 

"సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఇదే గుర్తింపు అనుకుంటున్నారు కానీ అది కాదు ఐడెంటిటీ. ఏదో కష్టపడి పనిచేసుకుంటూ వెళ్లిపోవడం కాదు. ఈ పనిలో నీదంటూ బ్రాండ్‌ కావాలి. అబ్బా ఫలానా పనిలో ఆమె లేదా అతడు ది బెస్ట్‌ అనిపించుకోవాలి. అదే అసలైన నైపుణ్యం. పైగా కెరీర్‌ డెవలప్‌మెంట్‌కి కావాల్సిన పెట్టుబడి అంటూ సోషల్‌ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చారు హనీఫ్‌. 

ఈ ఇంటర్వ్యూలో ఫెయిల్‌ అవ్వడంతో తానిన్నాళ్లు స్వంత గుర్తింపునే నిర్లక్ష్యం చేశానన్నా విషయాన్ని గ్రహించనని చెప్పారు. తాను ఈ ఫెయిల్యూర్‌ని మెల్కొలుపుగా భావించి ఆ దిశగా కృషి చేసి ది బెస్ట్‌ సోషల్‌ మీడియా మేనేజర్‌గా గుర్తింపు తెచ్చుకున్నట్లు చెప్పుకొచ్చారు. మరీ మీరు కూడా మీ వ్యక్తిగత బ్రాండ్‌ ఏంటన్నది ఆలోచిస్తున్నారా..! అంటూ  ముగించారామె. మరీ మనం కూడా మనకంటూ ఓ ఫైర్‌ బ్రాండ్‌ ఉండేలా ట్రై చేద్దామా..!.

(చదవండి: నిమ్మరసంతో గురకకు చెక్‌పెట్టండి..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement