katuka
-
వందేళ్లనాటి కాను(టు)క ఇది : ఇలా ఎపుడైనా ట్రై చేశారా?
ఇంట్లో పసిపాప వస్తోంది అంటే చాలు అమ్మమ్మ, నానమ్మల హడావిడి మొదలవుతుంది. పొత్తిళ్లలో బిడ్డకు కావాల్సిన మెత్తటి బట్టలు సేకరించడం, పాపాయికి సౌకర్యంగా ఉండేలా పాత చీరలతో చేసిన బొంతలు తయారీ మొదలు, కాటుక, ఆముదం లాంటివి సిద్ధం చేసుకునేందుకు రడీ అయిపోయేవారు. సహజంగాఇంట్లోనే కాటుకునే తయారుచేసుకునే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పత్తి దారంతో కొద్దిగా వామ్ము గింజలు వేసి వత్తి తయారు చేసిన దాన్ని ఆవ నూనెలో ముంచి మట్టి ప్రమిదలో దీపం వెలిగించింది. దానిపై వెడల్పాటి మూతను పెట్టింది. వత్తి మొత్తం కాలి ఆ మసి అంతా పళ్లానికి అంటుకుంది. ఈ మసిని తీసి కాజల్( కాటుక)గా తయారు చేసింది. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఆముదం, నూలు బట్ట సహాయంతో తమ నాన్నమ్మ, అమ్మమ్మ ఇలానే చేసేది అంటూ నెటిజన్లు గుర్తు చేసు కున్నారు. ఇందులో కెమికల్స్ ఉండవు. పైగా చిన్నపిల్లలకు కంటికి శీతలం కూడా అని వ్యాఖ్యానించారు.సహజమైన పదార్థాలతో ఇంట్లో తయారు చేసుకున్న కాటుక అయితే అందమైన అమ్మాయి కళ్ళు మరింత విశాలంగా బ్రైట్‌గా, బ్యూటీఫుల్‌గా మెరిసి పోతాయి. కళ్ళకి కాటుక పెట్టుకోవడం వల్ల కంటిలోని ఎర్రటి చారలు తొలగిపోతాయి. పైగా కాటుక పెట్టుకోవడం వల్ల దుమ్ము, ధూళి కణాలు కళ్ళలో పడకుండా ఉంటుంది. Did you know this 100 years old technique of Kajal making? Ingredients: Cotton, Ajwain, Mustard Oil and Ghee… pic.twitter.com/K6rF6yRcal — Aparajite | ಅಪರಾಜಿತೆ (@amshilparaghu) April 15, 2024 నోట్: చాలావరకు డాక్టర్లు శిశువులకు కాటుక పెట్టవద్దని చెబుతారు. ఎందుకంటే రసాయనాలతో తయారు చేసిన కాటుకల వల్ల కంటి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుందనేది గమనించ గలరు. -
విద్యా బాలన్ కళ్ల అందం సీక్రేట్ ఇదే!
బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ అందరికీ తెలిసే ఉంటుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘ది డర్టీ పిక్చర్’తో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాతో విద్యా బాలన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. హానీ మూవీతో తనెంటో నిరూపించుకుంది విద్యా బాలన్ అప్పటి నుంచి వరసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. విద్యా బాలన్ సినిమా కెరీర్ గురించి అందరికీ తెలిసినా ఆమె వ్యక్తిగత విషయాలు చాలా వరకూ బయటకు తెలీదు. కళ్ల అభినయంతో నటలో నూటికి నూరు మార్కులు కొట్టేసిన విద్యాబాలన్ ఓ ఇంటర్యూ తన కళ్ల అందం వెనుక దాగున్న రహస్యం గురించి, అందుకోసం తాను వాడే కాజల్ గురించి పంచుకుంది. నవరసనటసార్వభౌమురాలు విద్యాబాలన్ కళ్లకు కాటుక పెట్టందే గడప దాటదు. అది సాదాసీదా కాటుక కాదు.. పాకిస్తానీ పాపులర్ బ్రాండ్ ‘హష్మీ’ కాజల్. తన మీద అదృష్టం దృష్టిపడ్డానికి.. సక్సెస్ తన కెరీర్ అడ్రస్‌గా మారడానికి ఆ కాజలే కారణం అని విద్యాబాలన్ బలంగా నమ్ముతుందని బాలీవుడ్ వర్గాల భోగట్టా! (చదవండి: పార్లర్‌కి వెళ్లక్కర్లేకుండా..ఈ మెషిన్‌తో ఈజీగా వ్యాక్సింగ్, థ్రెడింగ్..) -
విషాదం: కాటుక డబ్బా గొంతులో ఇరుక్కుని..
కన్నవారి కంటిపాపకు.. ఇంటిని వెలిగించే చంటిపాపకు ఆ దేవుని చల్లని చూపులే శ్రీరామరక్ష. కానీ కంటిని కాపాడాల్సిన కాటుక కాలకూట విషమై విషాదాన్ని కుమ్మరిస్తే.. చంటిపాపను చల్లగా చూడాల్సిన దైవం ఉదాసీనతతో ఉపేక్షిస్తే.. ఎంతో ఘోరం జరిగిపోతుంది! చిన్నారి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది! కొద్దిగంటల వ్యవధిలో మొదటి పుట్టిన రోజు జరుపుకోబోతున్న ఆ పసివాడి జీవితంలో అదే జరిగింది. ఏడాది నిండబోతున్న ఆనందకర తరుణంలో ఆ బుజ్జాయికి నూరేళ్లూ నిండడంతో కుటుంబం కంటికీ.. మింటికీ ఏకధారగా విలపిస్తోంది. ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం మండలం రత్తకన్న గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. చిన్న కాటుక డబ్బాను మింగేసిన రిహాన్స్ దొళాయి అనే చిన్నారి ఊపిరాడక మృతి చెందాడు. నవంబర్ 4 చిన్నారి పుట్టిన రోజు కావడం గమనార్హం. రత్తకన్న గ్రామంలోని ఒడియా వీధికి చెందిన గీత బిసాయి, కంచిలి మండలం కొక్కిలి పుట్టుగ గ్రామానికి చెందిన కుమార్ దొళాయిలకు మూడేళ్ల క్రితం వివాహమైంది. గత ఏడాది నవంబర్ 4న వీరికి రిహాన్స్ దొళాయి జన్మించాడు. మరో రెండు రోజుల్లో బాబు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం కుమారుడికి కొత్తబట్టలు తొడిగిన తల్లి.. మందు గదిలో ఉంచి.. దేవుడికి నమస్కరించేందుకు తరువాత గదిలోకి వెళ్లింది. బాబు ఆడుకుంటూ దగ్గరలో ఉన్న కాటుక డబ్బాను మింగేశాడు. నోటి నుంచి రక్తరావడంతో కుటుంబ సభ్యులు భయపడ్డారు. గొంతులో ఏదో ఉండిపోయిందని గ్రహించి బయటకు తీయడానికి ప్రయతి్నంచారు. స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. (చదవండి: ప్రియుడితో రాసలీలలు.. భర్త రెడ్‌హ్యాండెడ్‌గా..) -
కాటుక కనులు నాటివే!
ఫ్లాష్ బ్యాక్ సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అనే ఆర్యోక్తి తెలిసిందే. అన్ని మానవ నాగరి కతల్లోనూ కళ్లకు అత్యంత ప్రాధాన్యమిచ్చే వారు. కనుల సొగసును తీర్చిదిద్దుకోవడానికి ప్రాచీనులు మక్కువ చూపేవారు. కాటుక, సుర్మా, మస్కారా లాంటి నయనాలం కరణాలు నిన్న మొన్నటివి కావు. వీటికి సహస్రాబ్దాల సుదీర్ఘ చరిత్రే ఉంది. దాదాపు పన్నెండు వేల ఏళ్ల కిందటే ఈజిప్షియన్లు, మెసపటోమియన్ ప్రజలు నల్లని చూర్ణంతో కన్నుల సోయగాన్ని తీర్చి దిద్దుకునేవారు. రాగి ఖనిజం, యాంటిమొనీ వంటి రకరకాల లోహాలతో తయారు చేసిన చూర్ణాన్ని వారు ఐ లైనర్‌గా ఉపయోగించే వారు. భారతదేశంలో కూడా కాటుక వాడుక ప్రాచీన కాలం నుంచే ఉండేది. పలు కావ్యాల్లో కాటుక గురించి ఉన్న వర్ణనలే ఇందుకు ఆధారం. ఆముదంతో దీపం వెలి గించి, దాని నుంచి వెలువడిన పొగకు ఏదైనా అడ్డుపెట్టి, దానికి అంటిన మసి నుంచి కాటుక తయారు చేసేవారు. ఇది కళ్లకు చలవ చేస్తుందని కూడా ప్రాచీన ఆయు ర్వేద నిపుణులు నమ్మేవారు. అయితే, పాశ్చా త్యులు మాత్రం కాటుక వాడుకను చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు. ఈజిప్టులోని టుటాంఖమన్ వద్ద 1920లో జరిపిన తవ్వ కాల్లో కాటుకకు సంబంధించిన ఆధారాలు పాశ్చాత్య ప్రపంచానికి తెలిశాయి. అప్పటి నుంచి పాశ్చాత్య ప్రపంచంలోనూ ఐ లైనర్ వాడుక మొదలైంది. కాటుకను అలంకరించు కునేది మహిళలే అయినా, కొన్ని ప్రాంతాల్లో పురుషులు కూడా దీన్ని అలంకరించుకోవడం మొదలైంది. ప్రాచీనకాలంలో ఐ లైనర్‌గా ఉపయోగించే కాటుక నల్లగా మాత్రమే ఉండేది. ఆధునిక యుగంలో రంగులు, మెరుపులతో కూడిన మస్కారాలు, కాటుక చేతికి అంటకుండా నేరుగా కళ్లకు రాసు కునేందుకు వీలుగా రకరకాల పెన్సిళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.