ఇంట్లో పసిపాప వస్తోంది అంటే చాలు అమ్మమ్మ, నానమ్మల హడావిడి మొదలవుతుంది. పొత్తిళ్లలో బిడ్డకు కావాల్సిన మెత్తటి బట్టలు సేకరించడం, పాపాయికి సౌకర్యంగా ఉండేలా పాత చీరలతో చేసిన బొంతలు తయారీ మొదలు, కాటుక, ఆముదం లాంటివి సిద్ధం చేసుకునేందుకు రడీ అయిపోయేవారు. సహజంగాఇంట్లోనే కాటుకునే తయారుచేసుకునే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పత్తి దారంతో కొద్దిగా వామ్ము గింజలు వేసి వత్తి తయారు చేసిన దాన్ని ఆవ నూనెలో ముంచి మట్టి ప్రమిదలో దీపం వెలిగించింది. దానిపై వెడల్పాటి మూతను పెట్టింది. వత్తి మొత్తం కాలి ఆ మసి అంతా పళ్లానికి అంటుకుంది. ఈ మసిని తీసి కాజల్( కాటుక)గా తయారు చేసింది. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఆముదం, నూలు బట్ట సహాయంతో తమ నాన్నమ్మ, అమ్మమ్మ ఇలానే చేసేది అంటూ నెటిజన్లు గుర్తు చేసు కున్నారు. ఇందులో కెమికల్స్ ఉండవు. పైగా చిన్నపిల్లలకు కంటికి శీతలం కూడా అని వ్యాఖ్యానించారు.సహజమైన పదార్థాలతో ఇంట్లో తయారు చేసుకున్న కాటుక అయితే అందమైన అమ్మాయి కళ్ళు మరింత విశాలంగా బ్రైట్‌గా, బ్యూటీఫుల్‌గా మెరిసి పోతాయి. కళ్ళకి కాటుక పెట్టుకోవడం వల్ల కంటిలోని ఎర్రటి చారలు తొలగిపోతాయి. పైగా కాటుక పెట్టుకోవడం వల్ల దుమ్ము, ధూళి కణాలు కళ్ళలో పడకుండా ఉంటుంది.
Did you know this 100 years old technique of Kajal making?
— Aparajite | ಅಪರಾಜಿತೆ (@amshilparaghu) April 15, 2024
Ingredients: Cotton, Ajwain, Mustard Oil and Ghee… pic.twitter.com/K6rF6yRcal
నోట్: చాలావరకు డాక్టర్లు శిశువులకు కాటుక పెట్టవద్దని చెబుతారు. ఎందుకంటే రసాయనాలతో తయారు చేసిన కాటుకల వల్ల కంటి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుందనేది గమనించ గలరు.
Comments
Please login to add a commentAdd a comment