Begum Jaan
-
ఏడ్చేసి కూల్ అయిపోతాను: నటి
ముంబయి: బాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ మూవీలు అనగానే గుర్తొచ్చే పేరు విద్యాబాలన్. ది డర్టీ పిక్చర్ తో ఇండస్ట్రీలో వేడి పుట్టించిన సీనియర్ నటి విద్యాబాలన్ ఖాతాలో పా, కహానీ వంటి హిట్లున్నాయి. హిట్ వస్తే ఎగిరి గంతేయకపోయినా.. ఫ్లాప్‌లు ఎదురైతే భరించలేనని, కాస్త కష్టంగా ఉంటుందని చెబుతోంది ఈ బొద్దుగుమ్మ. ఆమె లేటెస్ట్ మూవీలు బాబీ జాసూస్(2014), కహానీ సీక్వెల్ కహానీ-2(2016), బేగం జాన్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద పూర్తిగా నిరాశపరిచాయి. ఫెయిల్యూర్ ప్రభావం మాత్రం తర్వాతి మూవీపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుందట. సినిమా హిట్ అయితే బంధువులు, సన్నిహితులతో ఆనందాన్ని షేర్ చేసుకుంటాను. అదే విధంగా మూవీ ఫ్లాప్ అయితే ఏదో మూలకు పరిమితమయ్యే రకం కాదని స్పష్టం చేసింది విద్య. సినిమా పరాజయం పాలైతే ఆ బాధను అందరితో షేర్ చేసుకుంటూ ఏడ్చేస్తానని తెలిపింది. కొన్ని రోజులవరకు ఆ బాధ ఉండటం ఎవరికైనా సహజమేనని చెప్పింది. ఫ్లాపులపై ఇతరులు ఏమన్నా పట్టించుకోనని, ఏం చేయాలో తనకు తెలుసునని కొన్ని సందర్భాల్లో జరిగేదాన్ని ఎవరూ మార్చలేరని అభిప్రాయపడింది విద్యాబాలన్. -
మరో బాలీవుడ్ మూవీపై బ్యాన్..!
బాలీవుడ్ సినిమాలు పాకిస్తాన్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తుంటాయి. ముఖ్యంగా బాలీవుడ్ ఖాన్ ల సినిమాలకు పాక్ లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఇటీవల కాలం పాకిస్తాన్ సెన్సార్ బోర్డ్ చర్యల మూలంగా చాలా వరకు మన సినిమాలు పాక్ ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి. ముఖ్యంగా దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కే సినిమాలను పాక్ తమ దేశంలో ప్రదర్శించేందుకు అనుమతించదు. అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన దంగల్ సినిమాను కూడా భారతజాతీయం గీతం ఉందన్న కారణంతో పాక్ లో ప్రదర్శించేందుకు నిరాకరించింది. అయితే తాజాగా మరో సినిమాకు ఇదే పరిస్థితి ఎదురైంది. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బేగం జాన్ సినిమాపై పాక్ సెన్సార్ బోర్డ్ నిషేదం విధించింది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో మహేష్ భట్ నిర్మించిన ఈ సినిమాలో అభ్యంతరపెట్టాల్సిన అంశాలేవి లేవని, అయినా పాక్ నిషేదం విధించటం బాధాకరమని చిత్రయూనిట్ తెలిపింది. -
ఆ హీరోయిన్ ప్రెగ్నెంట్ అయిందా?
ముక్కు సూటిగా మాట్లాడటం.. మనస్సులో ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టడం బాలీవుడ్ నటి విద్యాబాలన్ నైజం. త్వరలో 'బేగం జాన్' సినిమాతో ప్రేక్షకులను పలుకరించబోతున్న ఈ అమ్మడు తాజాగా ఓ క్లినిక్ వద్ద కనిపించడం బాలీవుడ్లో వదంతులకు తావిచ్చింది. విద్యాబాలన్ గర్భవతి అయిందని, త్వరలోనే ఆమె ఓ బిడ్డను ప్రసవించబోతున్నదని ఊహాగానాలు గుప్పుమన్నాయి. ఈ విషయంలో ఆమెకు అర్థంలేని ప్రశ్నలు ఎదురవ్వడమూ మొదలైంది. చికాకు పరుస్తున్న ఈ ప్రశ్నలపై 'మిడ్-డే' పత్రికతో మాట్లాడుతూ విద్యాబాలన్ ఘాటుగా స్పందించింది. 'ఇది చాలా చికాకు పరుస్తోంది. నేను ఏదైనా కారణంతో క్లినిక్‌కు వెళ్లి ఉండవచ్చు. పెళ్లి తర్వాత ఓ మహిళ డాక్టర్ వద్దకు వెళ్లితే.. ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చిందని ఊహాగానాలు మొదలుపెడతారా?' అంటూ ప్రశ్నించింది. 'డర్టీ పిక్చర్' నటి విద్య 2012లో నిర్మాత సిద్ధార్థ రాయ్‌ను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి తన వ్యక్తిగత జీవితం గురించి, ప్రెగ్నెన్సీ గురించి, పిల్లలను ఎప్పుడు కంటారంటూ సంబంధంలేని ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారని ఆమె పేర్కొంది. 'ఇది నాకు, నా భర్తకు సంబంధించిన వ్యక్తిగత అంశం. దీంతో ఇతరులకు ఏం సంబంధం లేదు. ఇలా అడుగటం మా వ్యక్తిగత ఏకాంతంలోకి చొరబడటమే. కానీ మన దేశమే అలా తయారైంది. ఇరుగుపొరుగువారు, బంధువులు తరచూ ఇవే అనవసర ప్రశ్నలు అడుగుతుంటారు. మా పెళ్లినాడే మా అంకుల్ ఒకాయన పెళ్లి మండపంలోకి వచ్చి 'నెక్ట్స్టైం నేను చూసేటప్పటకీ మీరు ఇద్దరు కాదు ముగ్గురు ఉండాల'ని అన్నాడు. మా పెళ్లి ఫొటోలను కూడా అప్పటికి క్లిక్ చేయలేదు. కనీసం హనీమూన్‌కు ఎక్కడికీ వెళ్లాలో నిర్ణయించుకోలేదు. కానీ ఆయన అలా అనడంతో ఏం చెప్పాలో తోచలేదు. చిన్నగా నవ్వాను' అని విద్యాబాలన్ వివరించింది. 'అయినా, ఈ పిల్లల గోల ఏంటో? నేనేమీ పిల్లల్ని కనే మెషిన్‌ను కాదు. అయినా, ప్రపంచ జనాభా పెరుగుతూనే ఉంది. కాబట్టి ఎవరైనా పిల్లల్ని కనకుంటే వచ్చే నష్టమేమీ లేదు' అంటూ విద్య ముగించింది. -
మరో అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్.. బేగంజాన్
-
మరో అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్.. బేగంజాన్
బాలీవుడ్లో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్న విద్యాబాలన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న చిత్రం బేగం జాన్. దేశ విభజన సమయంలో వేశ్యలుగా మారిన బెంగాలీల జీవితం ఇతివృత్తాంతంగా ఈ సినిమా రూపొందుతోంది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో బెంగాలీ మూవీ రాజ్‌కహిని ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వేశ్యా గృహానికి చెందిన 11 మంది మహిళల జీవిత విశేషాలే బేగం జాన్. ఆ సమయంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా ఎదుర్కొన్న ఓ మహిళ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు . విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మరో వేశ్యగా గౌహర్ ఖాన్ నటించింది. మరోసారి అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది విద్యా. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రయూనిట్ సమక్షంలో ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతోంది. -
'బేగం జాన్' ఫస్ట్ లుక్
బాలీవుడ్లో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్న విద్యాబాలన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న చిత్రం బేగం జాన్. దేశ విభజన సమయంలో వేశ్యలుగా మారిన బెంగాలీల జీవితం ఇతివృత్తాంతంగా ఈ సినిమా రూపొందుతోంది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో బెంగాలీ మూవీ రాజ్‌కహిని ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వేశ్యా గృహానికి చెందిన 11 మంది మహిళల జీవిత విశేసాలే బేగం జాన్. ఆ సమయంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా ఎదుర్కొన్న ఓ మహిళ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు . విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మరో వేశ్యగా గౌహర్ ఖాన్ నటించింది. ఇప్పటికే ఆన్ లైన్లో లీక్ అయిన బేగం జాన్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో తాజాగా చిత్రయూనిట్ అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతోంది. -
బ్రోతల్ నిర్వాహకురాలిగా టాప్ హీరోయిన్!
సంచలన పాత్రలు పోషించడంలో ఎప్పుడూ ముందుంటుంది విద్యాబాలన్. 'డర్టీ పిక్చర్', 'కహానీ' వంటి సినిమాల్లో అద్భుతమైన నటనతో శెభాష్ అనిపించుకుంది ఆమె. తాజాగా మరో బోల్డ్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తన తాజా చిత్రం 'బేగం జాన్'లో ఆమె వ్యభిచార గృహ (బ్రోతల్) నిర్వాహకురాలి పాత్ర పోషిస్తున్నది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో బ్రోతల్ నిర్వాహకురాలి పాత్రలో లీనమైపోయిన ఆమె ఆహార్యం అదుర్స్ అనిపిస్తున్నది. సినిమాపై అంచనాలు పెంచుతున్నది. బెంగాలీ దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. బెంగాలీలో 'రాజ్‌కహిని' పేరిట శ్రీజిత్ రూపొందించిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. దేశ విభజన సమయంలో భారత్-పాకిస్థాన్ సరిహద్దు రేఖ వద్ద ఉన్న బ్రోతల్ హౌస్‌ను నిర్వహించే పాత్రలో విద్య కనిపించనుంది. ఈ సినిమాలో గౌహార్ఖాన్, పల్లవీ శార్దా వంటి ప్రముఖ తారాగణం నటిస్తోంది.