ఏడ్చేసి కూల్ అయిపోతాను: నటి | i will cry if my film flops, says Vidya Balan | Sakshi
Sakshi News home page

ఏడ్చేసి కూల్ అయిపోతాను: నటి

Published Mon, Jul 17 2017 12:08 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఏడ్చేసి కూల్ అయిపోతాను: నటి - Sakshi

ఏడ్చేసి కూల్ అయిపోతాను: నటి

ముంబయి: బాలీవుడ్‌లో లేడీ ఓరియంటెడ్ మూవీలు అనగానే గుర్తొచ్చే పేరు విద్యాబాలన్. ది డర్టీ పిక్చర్ తో ఇండస్ట్రీలో వేడి పుట్టించిన సీనియర్ నటి విద్యాబాలన్ ఖాతాలో పా, కహానీ వంటి హిట్లున్నాయి. హిట్ వస్తే ఎగిరి గంతేయకపోయినా.. ఫ్లాప్‌లు ఎదురైతే భరించలేనని, కాస్త కష్టంగా ఉంటుందని చెబుతోంది ఈ బొద్దుగుమ్మ. ఆమె లేటెస్ట్ మూవీలు బాబీ జాసూస్(2014)‌, కహానీ సీక్వెల్ కహానీ-2(2016), బేగం జాన్‌ చిత్రాలు బాక్సాఫీసు వద్ద పూర్తిగా నిరాశపరిచాయి. ఫెయిల్యూర్ ప్రభావం మాత్రం తర్వాతి మూవీపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుందట.

సినిమా హిట్ అయితే బంధువులు, సన్నిహితులతో ఆనందాన్ని షేర్ చేసుకుంటాను. అదే విధంగా మూవీ ఫ్లాప్ అయితే ఏదో మూలకు పరిమితమయ్యే రకం కాదని స్పష్టం చేసింది విద్య. సినిమా పరాజయం పాలైతే ఆ బాధను అందరితో షేర్ చేసుకుంటూ ఏడ్చేస్తానని తెలిపింది. కొన్ని రోజులవరకు ఆ బాధ ఉండటం ఎవరికైనా సహజమేనని చెప్పింది. ఫ్లాపులపై ఇతరులు ఏమన్నా పట్టించుకోనని, ఏం చేయాలో తనకు తెలుసునని కొన్ని సందర్భాల్లో జరిగేదాన్ని ఎవరూ మార్చలేరని అభిప్రాయపడింది విద్యాబాలన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement