న్యూ ఇయర్‌కి విద్యాబాలన్ నిర్ణయాలేం తీసుకోరట! ‘వై మేడమ్?’ అంటే.. ‘మొదటి రోజే వాటిని బ్రేక్ చేయడం బాగోదు కదా!’ అని పెద్దగా నవ్వేశారు. జనవరి ఫస్ట్ బాలన్ బర్త్‌డే కూడా. ఆ ఒక్క రోజు తన ఇష్టం వచ్చినట్లు ఉండి, రెండో రోజు నుంచీ డిసిప్లీన్డ్‌గా ఉండేందుకు విద్య ట్రై చేస్తారట. మంచి పాలసీనే. బాలన్‌కి నిన్నటితో 38 కంప్లీట్ అయ్యాయి. రోజుంతా ఇంట్లోనే ఆత్మీయులతో గడిపారు. డైటింగ్ పాట్లు లేకుండా చక్కగా డిన్నర్ చేశారు. వచ్చిన గిఫ్టుల్ని తెరిచి చూడ్డానికే.. ఆమెకు టైమ్ సరిపోలేదు. ‘ఇంతకీ మీకు మీరు ఇచ్చుకునే గిఫ్ట్ ఏమిటి?’’ అని మీడియావాళ్లెవరో బాలన్‌ని అడిగారు! ‘మీరెక్కడి నుంచి వచ్చారు?!’ అని బాలన్ ఉలిక్కిపడి చూసి పెద్దగా నవ్వారు. ‘మీ వాళ్లే ఎవరో ఇన్విటేషన్ పంపారు మేడమ్’ అన్నారు ఆ వచ్చినవాళ్లు.
ఏ పనైనా.. వితౌట్ గిల్టీ చెయ్యాలని అనుకున్నారట విద్యాబాలన్. అదే తనకు తను ఇచ్చుకునే గిఫ్ట్ అట! మరి న్యూ ఇయర్ రిజల్యూన్? అలాంటిదేమీ లేదట! అయితే టూర్‌లు తగ్గించి, కుదురుగా ఒక చోట ఉండేందుకు కుదురుతుందేమో చూడాలి ఈసారి అన్నారు! 2017 విద్యాబాలన్‌కి రెండు మంచి హిట్లు ఇచ్చింది. ఒకటి ‘బేగమ్ జాన్’. ఇంకోటి ‘తుమ్హారీ సులు’. ఇప్పటికైతే ఇంకా కొత్త సినిమాలకు సంతకాలేం చెయ్యలేదు. ‘ఈ ఏడాది మీ లైఫ్‌లో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు?’ నిన్న బర్త్‌డే పార్టీలోనే బాలన్‌ని మరో క్వొశ్చన్ వేస్తే.. ‘మార్పులేం కోరుకోవడం లేదు’ అన్నారు. అంటే.. మీనింగ్? ఇప్పుడున్నట్లే ఉండడం బాలన్‌కి బాగుందన్నమాట. అంటే.. సంతోషంగా.. తుమ్హారీ సులు చిత్రంలోని గృహిణిగా!
గృహిణిగా ఉండడమే హాయి!
Published Mon, Jan 1 2018 11:56 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment