ఆ రెండు పనులూ మహిళలకే ఎందుకు: హీరోయిన్
ఆ రెండు పనులూ మహిళలకే ఎందుకు: హీరోయిన్
Published Tue, Dec 13 2016 2:22 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
ఇంటి వ్యవహారాలతో పాటు బయట కూడా పని చేయాల్సిన అవసరం కేవలం మహిళలకే ఎందుకు ఉంటోందని బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ సూటిగా ప్రశ్నించింది. ఇంటి పని మొత్తం చక్కబెట్టుకుని, ఆ తర్వాత ఉద్యోగాలకో.. లేదా తనలా సినిమా షూటింగులకో వెళ్లాలంటే ఎలా కుదురుతుందని అడిగింది. తాను సూపర్ వుమన్ కావాలని ఏమాత్రం అనుకోవడం లేదని, షూటింగ్ చేసేటప్పుడు షూటింగ్.. ఇంటికి వెళ్లాక ఇల్లు.. ఈ రెండింటితో ఒకోసారి అసలు ఏం చేస్తున్నానా అనిపిస్తోందని చెప్పింది. అచ్చంగా మహిళలనే ఈ రెండు బాధ్యతలు సమానంగా నెరవేర్చాలని, రెండింటి మధ్య సమన్వయం సాధించాలని చెప్పడం చాలా అన్యాయమని ఆమె వాపోయింది.
షూటింగ్ పనిమీద బయటకు వెళ్లాల్సి వచ్చి, అదే సమయంలో ఇంట్లో ఏదైనా ప్రత్యేకమైన అకేషన్ ఉండి.. తాను వెళ్లలేకపోతే చాలా గిల్టీగా అనిపిస్తుందని, తాను మహిళను కావడం వల్లే అలా ఉంటుందని తెలిపింది. మన సమాజంలో మహిళల ఆలోచనా ధోరణి అలాగే ఉంటుందేమోనని, ఉద్యోగాలు లేదా వేరే వృత్తులు చేయడం వల్ల కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేమని చెప్పింది. అయినా కూడా పనిచేయాలని.. దాంతోపాటు ఇల్లు కూడా చక్కబెట్టుకోవాలనే అనిపిస్తుందని.. ఇలాంటి అవాస్తవిక అంచనాలను క్రమంగా దూరం చేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం సినిమాలు చేయడం తనకు బాగా ఇష్టమైన పని కాబట్టి ఇందులో అలిసిపోవడం అంటూ ఏమీ ఉండదని.. కానీ అందరి పరిస్థితి అలా ఉండదు కదా అని తెలిపింది.
Advertisement
Advertisement