బ్రోతల్‌ నిర్వాహకురాలిగా టాప్‌ హీరోయిన్‌! | First Look of Vidya Balan, Gauahar Khan Begum Jaan | Sakshi
Sakshi News home page

బ్రోతల్‌ నిర్వాహకురాలిగా టాప్‌ హీరోయిన్‌!

Published Wed, Jan 4 2017 8:25 PM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM

First Look of Vidya Balan, Gauahar Khan Begum Jaan

సంచలన పాత్రలు పోషించడంలో ఎప్పుడూ ముందుంటుంది విద్యాబాలన్‌. 'డర్టీ పిక్చర్‌', 'కహానీ' వంటి సినిమాల్లో అద్భుతమైన నటనతో శెభాష్‌ అనిపించుకుంది ఆమె. తాజాగా మరో బోల్డ్‌ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తన తాజా చిత్రం 'బేగం జాన్‌'లో ఆమె వ్యభిచార గృహ (బ్రోతల్‌) నిర్వాహకురాలి పాత్ర పోషిస్తున్నది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో బ్రోతల్‌ నిర్వాహకురాలి పాత్రలో లీనమైపోయిన ఆమె ఆహార్యం అదుర్స్‌ అనిపిస్తున్నది. సినిమాపై అంచనాలు పెంచుతున్నది.

బెంగాలీ దర్శకుడు శ్రీజిత్‌ ముఖర్జీ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. బెంగాలీలో 'రాజ్‌కహిని' పేరిట శ్రీజిత్‌ రూపొందించిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. దేశ విభజన సమయంలో భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దు రేఖ వద్ద ఉన్న బ్రోతల్‌ హౌస్‌ను నిర్వహించే పాత్రలో విద్య కనిపించనుంది. ఈ సినిమాలో గౌహార్‌ఖాన్‌, పల్లవీ శార్దా వంటి ప్రముఖ తారాగణం నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement