'బేగం జాన్' ఫస్ట్ లుక్ | Vidya Balan Begum Jaan First Look | Sakshi
Sakshi News home page

'బేగం జాన్' ఫస్ట్ లుక్

Published Tue, Mar 7 2017 10:06 AM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

'బేగం జాన్' ఫస్ట్ లుక్

'బేగం జాన్' ఫస్ట్ లుక్

బాలీవుడ్లో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్న విద్యాబాలన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న చిత్రం బేగం జాన్. దేశ విభజన సమయంలో వేశ్యలుగా మారిన బెంగాలీల జీవితం ఇతివృత్తాంతంగా ఈ సినిమా రూపొందుతోంది. శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకత్వంలో  బెంగాలీ మూవీ రాజ్‌కహిని ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వేశ్యా గృహానికి చెందిన 11 మంది మహిళల జీవిత విశేసాలే బేగం జాన్‌.

ఆ సమయంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా ఎదుర్కొన్న ఓ మహిళ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు . విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మరో వేశ్యగా గౌహర్ ఖాన్ నటించింది. ఇప్పటికే ఆన్ లైన్లో లీక్ అయిన బేగం జాన్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో తాజాగా చిత్రయూనిట్ అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement