
ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషల్ తాజాగా కోల్‌కతాలో నిర్వహించిన లైవ్ కన్సర్ట్‌లో పాల్గొన్నారు. ఈ మ్యూజిక్ కన్సర్ట్‌లో తన మధురమైన వాయిస్‌తో పాటలు పాడి అలరించారు. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈవెంట్‌లో పెద్దఎత్తున అభిమానులు హాజరయ్యారు.
అయితే లైవ్ కన్సర్ట్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శ్రేయా ఘోషల్ కచేరీ జరుగుతుండగా ఓ వ్యక్తి లవ్ ప్రపోజ్ చేసి తన ప్రియురాలికి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. మోకాళ్లపై నిలబడి తన ప్రియురాలికి ప్రేమను వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
అంతకుముందు అతను 'శ్రేయా ఘోషల్..యూ ఆర్ మై సెకండ్ లవ్' అనే ప్లకార్డును ప్రదర్శించాడు. ఇది చూసిన సింగర్ మ్యూజిక్ కాసేపు ఆపేసి నీ ఫస్ట్ లవ్ ఎవరు అంటూ అతన్ని ప్రశ్నించింది. దీంతో అతను తన పక్కనే ఉన్నా అమ్మాయిని చూపిస్తూ ఆమెకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత వెంటనే అందరిముందు ఆమెకు ప్రపోజ్ చేశాడు.
— Oindrila💌 (@_pehlanasha_) October 20, 2024
Comments
Please login to add a commentAdd a comment