Samyuktha And Vishnukanth Divorce Within 2 Months Of Marraige? - Sakshi
Sakshi News home page

Samyuktha: 'ఎఫైర్స్‌ ప్రేమను అలా మార్చేస్తాయి'.. సంయుక్త భర్త పోస్ట్‌ వైరల్‌

Published Tue, May 9 2023 1:30 PM | Last Updated on Tue, May 9 2023 2:29 PM

Samyuktha And Vishnukanth Divorce After 2 Months Of Marraige? - Sakshi

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్‌లు ఎంత కామనో, పెళ్లిళ్లు, విడాకులు కూడా అంతే కామన్‌గా మారింది. ఎంతో అన్యోన్యంగా కనిపించిన జంటలు కొద్దికాలానికే విడిపోతున్నారు. అలా ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు విడాకులు తీసుకొని ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు. తాజాగా మరో సినీ జంట కూడా విడాకులు తీసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న రెండు నెలలకే వాళ్లు ఈ నిర్ణయానికి రావడం గమనార్హం.

తమిళంలోని ప్రముఖ సీరియల్‌ ‘సిప్పినీల్ ముత్తు’ లో సంయుక్త-విష్ణుకాంత్‌ కలిసి నటించారు. వారి పరిచయం ప్రేమకు దారితీసింది. కొన్నాళ్ల డేటింగ్‌ అనంతరం పెద్దలను ఒప్పించి మార్చి 3న వైభవంగా పెళ్లి చేసుకున్నారు. చూడముచ్చటగా కనిపించే ఈ జంట మొదట్లో బాగానే ఉన్నా ఆ తర్వాత కలిసుండలేమంటూ ప్రకటించారు. సోషల్‌ మీడియాలో తమ పెళ్లి ఫోటోలన్నింటిని డిలీట్‌ చేసి షాకిచ్చారు.

చదవండి: హీరో అజిత్‌ రీల్‌ కూతురు చనిపోయినట్లు పోస్టర్‌ కలకలం 

అంతేకాకుండా ఇద్దరూ ఇన్‌స్టాలో స్పెషల్‌ నోట్‌తో విడిపోతున్నాం అంటూ ఇన్‌డైరెక్ట్‌ కోట్స్‌ చేస్తున్నారు. విష్ణుకాంత్‌ తన ఇన్‌స్టా స్టోరీలో.. 'ఎఫైర్స్‌ నిజమైన ప్రేమను ఫేక్‌ లవ్‌గా మార్చేస్తాయి. నో మోర్‌ సైలెన్స్‌' అంటూ ఓ పోస్ట్‌ చేశాడు. సంయుక్తా కూడా.. 'ఒక మహిళను శక్తివంతంగా ఎదుర్కోలేనప్పుడు ఇలాంటి నిందలు వేస్తారు.. ఫేక్‌లవ్‌' అంటూ ఇన్‌స్టా స్టోరీ లో పంచుకుంది.

ఇది కొత్త జీవితానికి ఆరంభం అని, ఇప్పట్నుంచి మరింత ధృడంగా ముందుకు వెళ్తానంటూ పేర్కొంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో వీరి విడాకుల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. పెళ్లైన రెండు నెలలకే విడిపోవడం ఏంటని పెదవి విరుస్తున్నారు.  చదవండి: బాయ్‌ఫ్రెండ్‌తో రొమాంటిక్‌ వీడియోను షేర్‌ చేసిన హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement