కటక్: వారిద్దరూ కలెక్టర్లు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఈ విషయం ఇంట్లో పెద్దలకు చెప్పడంతో వారు కూడా పెళ్లికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో, త్వరలో ఇద్దరు కలెక్టర్లు పెళ్లి బంధంతో ఒక్కటవబోతున్నారు. వారిద్దరూ ఎవరంటే.. పూరీ కలెక్టర్ సమర్థవర్మ, రాయగడ కలెక్టర్ స్వాధాదేవ్ సింగ్.
వివరాల ప్రకారం.. వీరిద్దరూ ఈ నెల 15వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ పెళ్లికి పూరీకి చెందిన కొంతమంది సేవాయత్‌లను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. అయితే, స్వాధాదేవ్ సింగ్ కొంతకాలం క్రితం బొలంగీర్ కలెక్టర్ చంచల రాణాను పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. మరోవైపు.. పూరీ కలెక్టర్ సమర్థవర్మ కూడా ఇటీవల రైల్వే అధికారిణి సుచిసింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరి మధ్య కూడా మనస్పర్థలు కారణంగా ఇటీవలే విడిపోయారు.
ఇక, 2011 బ్యాచ్ ఐఎఎస్ అధికారి సమర్థ్ వర్మ గతంలో కేంద్రపారా జిల్లా మేజిస్ట్రేట్, బిఎంసి కమిషనర్, రాయగడ పిడిడిఐ మరియు సంబల్పూర్ జిల్లా మేజిస్ట్రేట్‌గా పనిచేశారు. అదేవిధంగా, రాయగడ జిల్లా కలెక్టర్ స్వధా దేవ్ సింగ్ గతంలో నువాపా జిల్లా కలెక్టర్‌గా మరియు రూర్కెలాలో అదనపు జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు.
ఇది కూడా చదవండి: తగ్గేదేలే.. బీజేపీ మంత్రి సాహాసం
Comments
Please login to add a commentAdd a comment