బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ త్వరలోనే పెళ్లికూతురిగా మారనుందా అంటే అవుననే అంటున్నాయి బీటౌన్ వర్గాలు. ఇటీవలె కత్రినా 38వ బర్త్‌డే సందర్భంగా ఆమె పెళ్లి టాపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. ఇందుకు సల్మాన్ ఖాన్ మేనేజర్, స్టయిలిస్ట్ యాష్లె షేర్ చేసిన ఓ పోస్ట్ మరింత బలం చేకూరుస్తుంది. కత్రినా పుట్టినరోజు సందర్భంగా ఆమె పెళ్లి డ్రెస్‌లో ఉన్న ఫోటోను షేర్ చేసిన యాష్లె..త్వరలోనే ఇది నిజం కావాలంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. దీనికి కత్రినా కూడా 'థ్యాంక్యూ' అంటూ రిప్లై ఇవ్వడంతో ఈ పోస్ట్ చర్చనీయాంశమైంది.
కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ మధ్య ప్రేమాయణం నడుస్తోందని కొంతకాలంగా వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ తరచూ కలుసుకుంటూ చెట్టాపట్టాలేసుకుని చాలాసార్లు కెమెరాలకు చిక్కారు. కానీ తమ లవ్ కహానీపై మాత్రం ఇంతవరకు ఎలాంటి కన్‌ఫార్మేషన్ ఇవ్వలేదు. అయితే తాజాగా 40లోపు పెళ్లిచేసుకోవాలని కత్రినా భావిస్తుందని, దీంతో త్వరలోనే ఆమె పెళ్లి జరగనుందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.
ప్రియుడు విక్కీ కౌశల్‌తోనే కత్రినా త్వరలోనే ఏడడుగులు వేస్తుందని, ముహూర్తం కూడా ఫిక్స్ అంటూ బీటౌన్ మీడియా కోడై కూస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో సల్మాన్ ఖాన్, రణ్‌బీర్ కపూర్‌లతో కత్రినా ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. రణ్‌బీర్‌తో పెళ్లిదాకా వెళ్లిన రిలేషన్ అనుకోకుండా బ్రేక్ అయ్యింది. మరోవైపు రణ్‌బీర్ సైతం ఆలియాను త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించాడు.
Comments
Please login to add a commentAdd a comment