
Ranbir Kapoor and Alia Bhatt Postpone Their Wedding: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆలియా భట్- రణ్‌బీర్ కపూర్‌ల పెళ్లి కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా గతేడాది వీరి పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ చివర్లో వీరి పెళ్లి జరగాల్సి ఉండగా తాజాగా మరోసారి ఆలియా-రణ్‌బీర్‌లు వివాహాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది.
ఇద్దరూ పూర్తి చేయాల్సిన సినిమాలు ఇంకా పెండింగ్‌లో ఉండటం సహా ఇతర కారణాలతో తమ పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు సమాచారాం. తొలుత ముందుగా కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసి డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారంటా ఈ క్యూట్ కపుల్.
అంతేకాకుండా పెళ్లి అయిన వెంటనే ఖరీదైన ప్లాట్‌లోకి మారాలనుకుంటున్నారట. దీనికి సంబంధించి కూడా కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయట. దీంతో అన్ని పనులు అనుకున్నట్లు పూర్తి అయ్యాక వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలలో లేదా 2022 డిసెంబర్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. దీంతో ఆలియా-రణ్‌బీర్‌ల వివాహం కోసం వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిందేనట.
Comments
Please login to add a commentAdd a comment