Bigg Boss 5 Finalist Siri: Reaction After Shanmukh Deepthi Sunaina Break Up, Goes Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 : షణ్నూ-దీప్తి సునయనల బ్రేకప్‌ తర్వాత తొలిసారి ఇన్‌స్టాలో పోస్ట్‌

Published Sun, Jan 2 2022 11:30 AM | Last Updated on Sun, Jan 2 2022 12:56 PM

Bigg Boss 5 Siri Reaction After Shannu Deepthi Sunaina Break Up - Sakshi

Bigg Boss 5 Siri First Reaction After Shannu Deepthi Sunaina Break Up: సోషల్‌ మీడియా స్టార్స్‌ షణ్ముఖ్‌- దీప్తి సునయనల బ్రేకప్‌ ప్రస్తుతం నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. 5ఏళ్లుగా కలిసున్న వీళ్లు ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడం ఏంటని వారి ఫ్యాన్స్‌ షాకవుతున్నారు. బిగ్‌బాస్‌ ఫినాలే వరకు షణ్నూకు సపోర్ట్‌ అందిస్తూ వచ్చిన దీప్తి సునయన బిగ్‌బాస్‌ షో ముగిశాక ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. కానీ కొన్ని రోజులుగా మాత్రం​ తన సోషల్‌ మీడియా అకౌంట్లలో మార్పు తప్పదు అంటూ బ్రేకప్‌కి సంబంధించిన హింట్స్‌ ఇస్తూ వచ్చింది.

తాజాగా న్యూఇయర్‌కి ఒకరోజు ముందుగా షణ్ముఖ్‌తో విడిపోతున్నట్లు ఇన్‌స్టా వేదికగా ప్రకటించింది. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. అయితే సిరి కారణంగానే షణ్నూ-దీప్తి సునయన విడిపోయారంటూ ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి సిరిని టార్గెట్‌ చేస్తూ నెట్టింట ట్రోలింగ్‌కు దిగారు. తాజాగా షణ్నూ- దీప్తి సునయన బ్రేకప్‌ అనంతరం సిరి తొలిసారిగా స్పందించింది.

'ఎవరైనా మీ దగ్గరికి వచ్చి.. మీ జీవితం చాలా కఠినంగా ఉందే అని కామెంట్స్‌ చేస్తే.. వాటికంటే నేను మరింత స్ట్రాంగ్‌ అని చిరునవ్వుతో సమాధానం చెప్పండి' అంటూప్రముఖ మోటివేషనల్‌ స్పీకర్‌ మునిబా మజారి చెప్పిన కోట్స్‌ని తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. దీన్ని బట్టి.. పరోక్షంగా షణ్నూని స్ట్రాంగ్‌గా ఉండమని సలహా ఇస్తుందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వీరి బ్రేకప్‌కి కారణం 'నేను కాదు..ఇలా జరుగుతుందనుకోలేదంటూ' సిరి తన సన్నిహితులతో చెబుతూ ఎమోషనల్‌ అయినట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement