Siri Hanmanth Cries On Valentine Day Special Show In Star Maa, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Siri Hanmanth: షణ్ముఖ్‌తో హగ్‌లు, ముద్దులు.. తప్పు చేశానంటూ స్టేజ్‌పై సిరి కన్నీళ్లు!

Feb 8 2023 5:50 PM | Updated on Feb 8 2023 7:31 PM

Siri Hanmanth Cries On Valentine Day Special Show in Star Maa - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో షణ్ముఖ్‌- సిరిల ఫ్రెండ్‌షిప్‌ హద్దు మీరిన సంగతి తెలిసిందే! ఈ విషయాన్ని వాళ్లే స్వయంగా ఒప్పుకున్నారు. తప్పనిపించినా వీడి ఉండలేకపోతున్నామని వాపోయారు. కానీ ఎప్పుడైతే సిరి బాయ్‌ఫ్రెండ్‌, నటుడు శ్రీహాన్‌ బిగ్‌బాస్‌ స్టేజీపైకి వచ్చాడో అతడికి ముఖం చూపించుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేసింది సిరి. ఇక శ్రీహాన్‌.. నన్ను వదిలేస్తున్నావా? అని ఒక డైలాగ్‌ విసరడంతో సిరిని మరింత తిట్టిపోశారు నెటిజన్లు. ఇక కట్‌ చేస్తే షో అయిపోయాక వాళ్లిద్దరూ ఎప్పటిలాగే కలిసిపోయారు. నెగెటివిటీకి చెక్‌ పెడుతూ మరింత దగ్గరయ్యారు.  

ఇక త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14న వాలంటైన్స్‌ డే సందర్భంగా స్టార్‌ మా నిర్వహించిన స్పెషల్‌ ఎపిసోడ్‌లో శ్రీహాన్‌, సిరి జంట పాల్గొంది. వారితో పాటు మిగతా బుల్లితెర రియల్‌ కపుల్స్‌ కూడా ఈ ఈవెంట్‌లో సందడి చేయనున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో సిరి తాను తప్పు చేశానంటూ స్టేజ్‌పైనే నిర్మోహమాటంగా ఒప్పేసుకుంది. శ్రీహాన్‌కు గోల్డ్ రోజు ఇచ్చి ప్రపోజ్ చేసిన సిరి, అతడు చాలా యూనిక్ అంటూ పొగిడింది. శ్రీహాన్ బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు అతడిని చాలా మిస్ అయ్యానని, గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈ షర్ట్‌పై ముద్దులు పెట్టేదాన్ని అని చెప్పింది. 

అనంతరం ఆ షర్ట్‌ను ప్రియుడు శ్రీహాన్‌కు గిఫ్ట్‌ ఇచ్చింది. అలా పలు గిఫ్ట్‌లతో శ్రీహాన్‌ను సర్‌ప్రైజ్‌ చేసిన సిరి అనంతరం మాట్లాడుతూ.. ‘చిన్న, చిన్న తప్పులు ఎవరైనా చేస్తారు. కానీ స్టేజ్‌పై ఎవరు దాన్ని ఒప్పుకోరు. నేను నిజంగానే తప్పు చేశాను.. అది నాకు తెలియకుండానే జరిగింది’ అంటూ కన్నీరు పెట్టుకుంది. దీంతో సిరిని శ్రీహన్ దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. దీంతో అక్కడ ఉన్న యాంకర్‌ రవి, రష్మీతో పాటు మిగతా కంటెస్టెంట్స్‌ సైతం స్టేజ్‌పైకి వచ్చి సిరిని ఓదార్చారు. కాగా బిగ్‌బాస్‌ షో అనంతరం షణ్ముఖ్‌కు దీప్తి సునయన బ్రేకప్‌ చెప్పిన సంగతి తెలిసిందే. 

చదవండి: 
 కిరాక్‌ ఆర్పీ చేపల పులుసు బిజినెస్‌ వారి భిక్షే: రాకింగ్‌ రాకేష్‌ షాకింగ్‌ కామెంట్స్‌
సీక్రెట్‌ డేటింగ్‌.. ఎట్టకేలకు మూడుమూళ్ల బంధంతో ఒక్కటైన హీరోహీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement