
Shrihan Emotional Intsgram Post Amids Break Up Rumours With Siri: బిగ్‌బాస్ షోతో కొందరు ఓవర్ నైట్ స్టార్స్ అయితే, మరికొందరు మాత్రం ఇమేజ్ డ్యామేజ్ చేసుకొని బయటకు వస్తారు. తాజాగా బిగ్‌బాస్ సీజన్-5లో సిరి-షణ్ముఖ్‌లు కూడా ఈ విధంగానే నెగిటివిటీ మూటగట్టుకున్నారు. ఫలితంగా తమ ఐదేళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలుకుతూ దీప్తి సునయన షణ్ముఖ్‌తో విడిపోయింది. ఇక కలిసుండలేనంటూ తెగదెంపులు చేసుకుంది.
ఇక అప్పటినుంచి శ్రీహాన్ కూడా త్వరలోనే సిరికి బ్రేకప్ చెప్పేస్తాడంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరి ఇన్‌స్టా అకౌంట్లపై ఫోకస్ పెరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం(జనవరి3)న సిరి బర్త్‌డే సందర్భంగా శ్రీహాన్ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసుకున్నాడు. హ్యాపీ బర్త్‌డే సిరి.. ఈ సంవత్సరం పాజిటివ్ వైబ్స్‌తో నీ జీవితం సాగాలని ఆశిస్తున్నా. నీ లక్ష్యాలను త్వరలోనే సాధిస్తావ్. గాడ్ బ్లస్ యూ అంటూ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు.
కాగా బిగ్‌బాస్‌లో సిరిని ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా ఆమె గెలుపు కోసం చివరి వరకు సపోర్ట్ చేస్తూ వచ్చిన శ్రీహాన్.. బిగ్‌బాస్ తర్వాత మాత్రం సిరితో కలిసి ఎక్కడా కనిపించలేదు. దీంతో దీప్తి- షణ్ముక్‌ల మాదిరిగానే వీళ్లు కూడా విడిపోతారా అనే ఊహాగానాల నేపథ్యంలో శ్రీహాన్ ఇన్‌స్టా పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.