
సోషల్ మీడియా స్టార్స్ దీప్తి సునయన- షణ్ముఖ్ జస్వంత్‌లు బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ సీజన్-5 నుంచి బయటకు వచ్చాక దీప్తి షణ్నూకి బ్రేకప్ చెప్పేసింది. తమదారులు వేరని, ఇప్పటికైనా కెరీర్‌పై దృష్టిపెట్టాలనుకుంటున్నట్లు చెప్పి విడిపోతున్నట్లు స్పష్టం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి జంటగా ఎక్కడా కనిపించలేదు.
ఆమధ్య ఓ అవార్డ్ ఫంక్షన్‌లో దీప్తిని చూస్తూ షణ్నూ మురిసిపోయిన ఆమె మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవలె ఓ ఇంటిని కొనుగోలు చేసిన దీప్తి సునయన రీసెంట్‌గానే తల్లిదండ్రులతో కలిసి గృహప్రవేశం చేసింది. అయినా షణ్నూ ఆమెతో కనిపించలేదు. దీంతో బ్రేకప్‌పై ఇద్దరూ సీరియస్‌గానే ఉన్నారని ఫ్యాన్స్ తెగ హర్ట్ అయ్యారు.
అయితే తాజాగా నేడు(మంగళవారం)దీప్తి సునయన బర్త్‌డే సందర్భంగా షణ్నూ షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. హ్యాపీ బర్త్‌డే డీ(దీప్తి సునయన)అంటూ షణ్నూ పోస్ట్ చేశాడు. మరి దీనికి దీప్తి రెస్పాండ్ అవుతుందా? లేదా అన్నది చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment