Brake up
-
ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ షణ్నూ పోస్ట్‌కి దీప్తి సునయన రిప్లై ఇస్తుందా?
సోషల్ మీడియా స్టార్స్ దీప్తి సునయన- షణ్ముఖ్ జస్వంత్‌లు బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ సీజన్-5 నుంచి బయటకు వచ్చాక దీప్తి షణ్నూకి బ్రేకప్ చెప్పేసింది. తమదారులు వేరని, ఇప్పటికైనా కెరీర్‌పై దృష్టిపెట్టాలనుకుంటున్నట్లు చెప్పి విడిపోతున్నట్లు స్పష్టం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి జంటగా ఎక్కడా కనిపించలేదు. ఆమధ్య ఓ అవార్డ్ ఫంక్షన్లో దీప్తిని చూస్తూ షణ్నూ మురిసిపోయిన ఆమె మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవలె ఓ ఇంటిని కొనుగోలు చేసిన దీప్తి సునయన రీసెంట్‌గానే తల్లిదండ్రులతో కలిసి గృహప్రవేశం చేసింది. అయినా షణ్నూ ఆమెతో కనిపించలేదు. దీంతో బ్రేకప్‌పై ఇద్దరూ సీరియస్‌గానే ఉన్నారని ఫ్యాన్స్ తెగ హర్ట్ అయ్యారు. అయితే తాజాగా నేడు(మంగళవారం)దీప్తి సునయన బర్త్‌డే సందర్భంగా షణ్నూ షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. హ్యాపీ బర్త్‌డే డీ(దీప్తి సునయన)అంటూ షణ్నూ పోస్ట్ చేశాడు. మరి దీనికి దీప్తి రెస్పాండ్ అవుతుందా? లేదా అన్నది చూడాల్సి ఉంది. -
లైగర్ హీరోయిన్‌తో బ్రేకప్‌పై స్పందించిన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే- షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ విడిపోయినట్లు బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఖాళీ పీలి సినిమా నుంచి మొదలైన వారి డేటింగ్ జర్నీ ముగిసినట్లు తెలుస్తుంది. గతంలో పార్టీలకు, ఫంక్షన్లకు, ట్రిప్పులకు, టూర్లకు కలిసి వెళ్తూ హడావుడి చేసిన జంట తాజాగా బ్రేకప్ చెప్పేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఇదే విషయాన్ని అనన్య పాండే ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ ఇషాన్ క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా కత్రినా కైఫ్, సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి ఇషాన్ ఖట్టర్ ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అనన్యతో నువ్వు విడిపోయావు కదా అని కరణ్ ప్రశ్నించగా ప్రస్తుతానికి తాను సింగిల్ అని పేర్కొన్నాడు. మరిప్పుడు అనన్యతో స్నేహంగా ఉంటున్నారా అని అడగ్గా నా జీవితాంతం ఆమెకు స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నా. నాకు తెలిసిన వాళ్లలో మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ అనన్య అని చెప్పాడు. -
బ్రేకప్ కాదు చిన్న బ్రేక్!
మాది బ్రేకప్ కాదు చిన్న బ్రేక్ మాత్రమే అంటున్నారు యువ సంగీత దర్శకుడు అనిరుధ్. ఆ కథేందో చూద్దామా ‘నటుడు ధనుష్, అనిరుధ్ల మధ్య స్నేహబంధం మాత్రమే కాదు, కుటుంబ బంధమూ ఉంది. అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా పరిచయం చేసింది ధనుష్ అని తెలిసిందే. ధనుష్ కథానాయకుడిగా నటించి నిర్మించిన, ఆయన భార్య ఐశ్వర్య దర్శకత్వం వహించిన 3 చిత్రం ద్వారా అనిరుధ్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ కాక పోయినా అనిరుధ్‌ను మాత్రం బాగా పాపులర్ చేసింది. ఆ తరువాత కూడా ధనుష్ నటించిన వేలై ఇల్లా పట్టాదారి, ఆయన నిర్మించిన ఎదిర్‌నీశ్చల్, నానుమ్ రౌడీదాన్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అలాంటిది ఆ తరువాత ధనుష్, అనిరుద్ కాంబినేషన్ లో చిత్రాలు రాలేదు. దీంతో వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయనే రకరకాల వదంతులు హల్చల్ చేశాయి. ధనుష్‌నే కాదు ఆయన కుటుంబం అంతా అనిరుధ్‌ను పక్కన పెట్టేశారనే ప్రచారం జరుగుతోంది. ధనుష్‌కు దూరం అయిన అనిరుధ్ ఆయనకు పోటీ నటుడిగా భావించే శింబుతో దోస్తానా చేస్తున్నట్లు మీడియాలో కథలు ప్రచారం అయ్యా యి. అందుకు కారణం లేకపోలేదు. శింబు రాసిన కలకలం సృష్టించిన బీప్ సాంగ్‌లో అనిరుధ్‌కు భాగం ఉందనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. ధనుష్, అనిరుధ్ల మధ్య దూరానికి ఇదీ ఒక కారణం అన్నారొక వర్గం. ఇన్ని రకాలుగా వదంతులు మార్మోగుతున్నా ఇటు ధనుష్ గానీ, అటు అనిరుద్ గానీ నోరు మెదపకుండా మౌనం పాటిస్తూ వచ్చారు. చాలా కాలం తరువాత అనిరుధ్ ఈ వ్యవహారంపై స్పం దించారు. ఆయన మాట్లాడుతూ ధనుష్‌కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అసలు బ్రేకప్ అన్న మాటేకే తావు లేదని, చిన్న బ్రేక్ మాత్రమేనని అన్నారు. తామిద్దరం కలిసి వరుసగా చిత్రాలకు పనిచేయడం వల్ల ప్రేక్షకులకూ బోర్ కొడుతుందని, చిన్న గ్యాప్ తీసుకుని కలిసి పనిచేస్తే వారికి సంతోషంగా ఉంటుందని అన్నారు. అభిమానుల అభిరుచిని గౌరవించే విధంగా తాను, ధనుష్ కలిసి పని చేయడానికి చిన్న బ్రేక్ తీసుకున్నామని, త్వరలోనే మళ్లీ కలిసి పని చేస్తామని అనురుధ్ చెప్పారు.