బ్రేకప్‌ కాదు చిన్న బ్రేక్‌! | News about Dhanush and Anirudh | Sakshi
Sakshi News home page

బ్రేకప్‌ కాదు చిన్న బ్రేక్‌!

Published Thu, Jan 12 2017 8:20 AM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM

బ్రేకప్‌ కాదు చిన్న బ్రేక్‌!

బ్రేకప్‌ కాదు చిన్న బ్రేక్‌!

మాది బ్రేకప్‌ కాదు చిన్న బ్రేక్‌ మాత్రమే అంటున్నారు యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌. ఆ కథేందో చూద్దామా ‘నటుడు ధనుష్, అనిరుధ్‌ల మధ్య స్నేహబంధం మాత్రమే కాదు, కుటుంబ బంధమూ ఉంది. అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా పరిచయం చేసింది ధనుష్‌ అని  తెలిసిందే. ధనుష్‌ కథానాయకుడిగా నటించి నిర్మించిన, ఆయన భార్య ఐశ్వర్య దర్శకత్వం వహించిన 3 చిత్రం ద్వారా అనిరుధ్‌ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు.

ఆ చిత్రం కమర్షియల్‌గా సక్సెస్‌ కాక పోయినా అనిరుధ్‌ను మాత్రం బాగా పాపులర్‌ చేసింది. ఆ తరువాత కూడా ధనుష్‌ నటించిన వేలై ఇల్లా పట్టాదారి, ఆయన నిర్మించిన ఎదిర్‌నీశ్చల్, నానుమ్‌ రౌడీదాన్  చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అలాంటిది ఆ తరువాత ధనుష్, అనిరుద్‌ కాంబినేషన్ లో చిత్రాలు రాలేదు.

దీంతో వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయనే రకరకాల వదంతులు హల్‌చల్‌ చేశాయి. ధనుష్‌నే కాదు ఆయన కుటుంబం అంతా అనిరుధ్‌ను పక్కన పెట్టేశారనే ప్రచారం జరుగుతోంది. ధనుష్‌కు దూరం అయిన అనిరుధ్‌ ఆయనకు పోటీ నటుడిగా భావించే శింబుతో దోస్తానా చేస్తున్నట్లు మీడియాలో కథలు ప్రచారం అయ్యా యి. అందుకు కారణం లేకపోలేదు. శింబు రాసిన కలకలం సృష్టించిన బీప్‌ సాంగ్‌లో అనిరుధ్‌కు భాగం ఉందనే టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. ధనుష్, అనిరుధ్‌ల మధ్య దూరానికి ఇదీ ఒక కారణం అన్నారొక వర్గం. ఇన్ని రకాలుగా వదంతులు మార్మోగుతున్నా ఇటు ధనుష్‌ గానీ, అటు అనిరుద్‌ గానీ నోరు మెదపకుండా మౌనం పాటిస్తూ వచ్చారు. చాలా కాలం తరువాత అనిరుధ్‌ ఈ వ్యవహారంపై స్పం దించారు.

ఆయన మాట్లాడుతూ ధనుష్‌కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అసలు బ్రేకప్‌ అన్న మాటేకే తావు లేదని, చిన్న బ్రేక్‌ మాత్రమేనని అన్నారు. తామిద్దరం కలిసి వరుసగా చిత్రాలకు పనిచేయడం వల్ల ప్రేక్షకులకూ బోర్‌ కొడుతుందని, చిన్న గ్యాప్‌ తీసుకుని కలిసి పనిచేస్తే వారికి సంతోషంగా ఉంటుందని అన్నారు. అభిమానుల అభిరుచిని గౌరవించే విధంగా తాను, ధనుష్‌ కలిసి పని చేయడానికి చిన్న బ్రేక్‌ తీసుకున్నామని, త్వరలోనే మళ్లీ కలిసి పని చేస్తామని అనురుధ్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement