విజయ్ సేతుపతితో రొమాన్స్ | Nayantara to star in Dhanush's next production venture! | Sakshi
Sakshi News home page

విజయ్ సేతుపతితో రొమాన్స్

Published Sat, Aug 30 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 12:38 PM

విజయ్ సేతుపతితో రొమాన్స్

విజయ్ సేతుపతితో రొమాన్స్

ఈ తరం యువ నటుల్లో అతి తక్కువ కాలంలో తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు విజయ్ సేతుపతి. పిజ్జాతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈయన ప్రస్తుతం చాలా బిజీ హీరో. ఇప్పటి వరకు వర్ధమాన హీరోయిన్లతో డ్యూయెట్లు పాడిన విజయ్‌సేతుపతి త్వరలో అగ్రతార నయనతారతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారన్నది తాజా వార్త. ఆ మధ్య ఒక సినిమా కార్యక్రమంలో ఒక హీరోయిన్‌ను కిడ్నాప్ చేయమంటే ఏ నటిని కిడ్నాప్ చేస్తారన్న వ్యాఖ్యాత ప్రశ్నకు నయనతారను అంటూ ఠక్కున సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు విజయ్ సేతుపతి.
 
 అదే వేదికపై ఆశీనురాలైన నయతార ముసిముసి నవ్వులు రువ్వారు. అలాంటిది ఇంత త్వరగా వీరిద్దరూ జత కడతారని ఎవరూ ఊహించి ఉండరు. ఈ క్రేజీ జంట కలయికలో నానుం రౌడీ దాన్ అనే చిత్రం తెరకెక్కనుంది. విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని నటుడు ధనుష్ నిర్మిస్తున్నారు. ఇంతకుముందు ఈయన నిర్మించి, హీరోగా నటించిన వేలై ఇల్లా పట్టాదారి విశేష ప్రజాదరణ పొందింది. తాజాగా ఆయన నిర్మిస్తున్న నానుం రౌడీదాన్ చిత్రానికి పోడాపోడి చిత్రం ఫేమ్ విఘ్నేష్ దర్శకత్వం వహించనున్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ చిత్రానికి సంగీత బాణీలు కడుతున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement