‘జవాన్‌’మూవీ ట్విటర్‌ రివ్యూ | Jawan Twitter Review: Shah Rukh Khan, Nayanthara Starred Movie - Sakshi
Sakshi News home page

Jawan Twitter Review: ‘జవాన్‌’కు ఊహించని టాక్‌.. షారుఖ్‌ కెరీర్‌లోనే...

Published Thu, Sep 7 2023 6:43 AM | Last Updated on Thu, Sep 7 2023 8:24 AM

Jawan Movie Twitter Review In Telugu - Sakshi

షారుఖ్‌ ఖాన్‌, నయనతార జంటగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘జవాన్‌’.‘పఠాన్‌’లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది.  నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషించారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సం‍స్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

 అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘జవాన్‌’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్‌ 7)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. 

(చదవండి: షారుఖ్‌ రిస్కీ ఫైట్స్‌.. నయన్‌కు ఫస్ట్‌.. అట్లీ సెకండ్‌.. ‘జవాన్‌’విశేషాలివీ!)

దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. జవాన్‌ మూవీ ఎలా ఉంది?స్టోరీ ఏంటి? తదితర విషయాలు  ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.

‘జవాన్‌’కి ట్విటర్‌లో పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. షారుఖ్‌ ఖాతాలో మరో భారీ హిట్‌ పడిందని కామెంట్‌ చేస్తున్నారు. షారుఖ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ అదిరిపోయాయని అంటున్నారు. జవాన్‌ బాక్సాఫీస్‌ వద్ద సునామీ క్రియేట్‌ చేయడం ఖాయమని, షారుఖ్‌ కెరీర్‌లోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అని  కొంతమంది ట్వీట్స్‌ చేస్తున్నారు. 

ఇప్పుడే జవాన్‌ చూశాను. యాక్షన్‌ సీక్వెన్స్‌ అదిరిపోయాయి. కథనం ఆకట్టుకుంది. షారుఖ్‌ నటన అదుర్స్‌ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

‘జవాన్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌. అట్లీ ఓ అద్భుతమైన కళాఖండాన్ని అందించాడు. ఎమోషన్స్‌ మరియు మాస్‌ యాక్షన్స్‌తో అద్భుతంగా సినిమాను తీర్చిదిద్దాడు. ఈ ఏడాది షారుఖ్‌ ఖాన్‌దే. విజయ్‌ సేతుపతి, నయనతార అద్భుతంగా నంటించారు. జవాన్‌ చూడడం మిస్‌ కాకండి’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

జవాన్‌ విజయం సాధించాడు. సినిమాపై పెరిగిన అంచనాల కంటే ఎక్కువగానే ఉంది. మాస్ పాన్ ఇండియా మూవీ అంటే ఎలా ఉండాలో అలాంటి సినిమాను అట్లీ ఇచ్చాడు. కింగ్ సైజ్‌డ్ ఎంటర్‌టైనర్ సినిమాను అందించాడు. జవాన్ తప్పకుండా చూడండి’అని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.  

‘ఫస్టాఫ్‌ ఓకే. సెకండాఫ్‌ యావరేజ్‌. నయనతార ఎంట్రీ బాగుంది. విజయ్‌ సేతుపతి నటన అద్భుతం. ఒక్క మాటలో చెప్పాలంటే...‘జవాన్‌’ షారుఖ్‌ అభిమానులను అలరిస్తుంది’ అని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement