ఏదో ఒకరోజు వడ్డీతో సహా తిరిగొస్తుంది: నయనతార | Nayanthara Against Comments On Dhanush | Sakshi
Sakshi News home page

ఏదో ఒకరోజు వడ్డీతో సహా తిరిగొస్తుంది: నయనతార

Published Fri, Nov 29 2024 4:28 PM | Last Updated on Fri, Nov 29 2024 6:07 PM

Nayanthara Against Comments On Dhanush

కోలీవుడ్‌లో  నటి నయనతార, ధనుష్‌ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఆమెపై తెరకెక్కిన డాక్యుమెంటరీ విషయంలో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో నయనతారతో పాటు ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివనన్‌పై ధనుష్‌ దావా వేసిన సంగతి తెలిసిందే. కోర్టు కూడా సమాధానం చెప్పాలని నయన్‌ను కోరింది. అయితే, తాజాగా సోషల్‌మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్‌ ఒకటి నెట్టింట వైరల్‌ అవుతుంది. ధనుష్‌ను టార్గెట్‌ చేసే నయన్‌ పోస్ట్‌ చేసింది అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.

కోలీవుడ్‌లో నయనతార, ధనుష్‌ వివాదం ఇప్పట్లో తగ్గేలా లేదు. సుమారు మూడు పేజీలతో ధనుష్‌పై నయన్‌ సంచలన ఆరోపణలు చేస్తూ ఒక లేఖ విడుదల చేసి కొద్దిరోజులు కాకముందే ఆమె మరోసారి పరోక్షంగా పదునైన వ్యాఖ్యలు చేసింది. ధనుష్‌ను హెచ్చరిస్తూ నయన్‌ ఇలా పోస్ట్‌ చేసింది. 'అబద్ధాలతో పక్క వారి జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించకండి. అది కూడా అప్పుతో సమానమే. ఏదో ఒకరోజు మీకు కూడా అంతకు మించి వడ్డీతో సహా తిరిగి వస్తుంది. ఈ విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోండి.' అంటూ ఒక నోట్‌ను నయన్‌ పంచుకుంది.

సోషల్‌మీడియాలో ఆమె ఎవరి గురించి ఈ పోస్ట్‌ చేసిందో తెలియదు. కానీ, కోలీవుడ్‌లో మాత్రం ధనుష్‌ను టార్గెట్‌ చేస్తూనే ఈ పోస్ట్‌ ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.  'నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌'  డాక్యుమెంటరీ విషయంలో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. ధనుష్‌ నిర్మాతగా తెరకెక్కించిన ‘నానుమ్‌ రౌడీ దాన్‌’కు సంబంధించిన ఫుటేజ్‌ను నయన్‌ ఉపయోగించారు. అందుకు పరిహారంగా రూ.10 కోట్లు డిమాండ్‌ చేస్తూ ధనుష్‌ లీగల్‌ నోటీసులు పంపించారు. ఈ కారణంతో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement