
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న అనుపమ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజనులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఇక మీ జీవితంలో నిజమైన ప్రేమ ఉందా అంటూ ఓ నెటిజన్ అడగ్గా అనుపమ ఓపెన్ అయ్యింది. గతంలో ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించానని, అయితే అతనితో బ్రేకప్ అయిపోయిందని చెప్పుకొచ్చింది. అయితే ఆ వ్యక్తి ఎవరన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు.
గతంలో క్రికెటర్ బుమ్రాతో అనుపమ ప్రేమాయణంలో ఉందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బుమ్రా వివాహానికి కొద్ది రోజుల ముందే ఇది హాట్‌టాపిక్‌గా మారింది. అయితే అనూహ్యాంగా బుమ్రా టీవీ యాంకర్ సంజనను పెళ్లాడటం, ఆ తర్వాత అనుపమ స్యాడ్ సాంగ్స్‌తో వీడియోలు చేయడం అప్పట్లో నెట్టింట హల్‌చల్ చేశాయి. ఇప్పుడు అనుపమ బ్రేకప్ విషయం బయటపెట్టడంతో మరోసారి బుమ్రా పేరు తెరపైకి వచ్చింది. ఇక సినీ హీరోల్లో రామ్ పోతినేని తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పిన అనుపమ..తన తల్లి చేసే అన్ని వంటలు చాలా ఇష్టమని పేర్కొంది. పెయింటిగ్స్ వేస్తుంటే మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందని, ఈ మధ్యే పెయింటింగ్స్ వేయడం నేర్చుకున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment