![Anushka Chitchat with twitter followers - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/5/Anushka-%282%29.jpg.webp?itok=2pbS6-L1)
ఇటీవలే ట్విట్టర్‌లో జాయిన్ అయ్యారు అనుష్క. ఆదివారం సాయంత్రం అభిమానులతో ఆమె చిట్‌చాట్ చేశారు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ విశేషాలు.
► యోగా టీచర్‌గా మీరు నేర్చుకున్న విషయం?
మనలో ప్రతి ఒక్కరూ భిన్నమైన వాళ్లమే. మనల్ని మనం కోల్పోకుండా ప్రతి ఒక్కరినీ ప్రేమించాలి, గౌరవించాలి. నిరంతరం స్వీయ విమర్శ చేసుకుంటూ ఉండాలి.
► మీకు ఇష్టమైన జంతువు?
డాల్ఫిన్ అంటే బాగా ఇష్టం.
► లాక్‌డౌన్‌లో మీరు నేర్చుకున్న విషయం?
మన జీవితం, మన చుట్టూ ఉన్నవన్నీ ఎప్పుడూ మన చేతుల్లో ఉండవు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే ప్రతీ క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకుందాం.
► మీకు నచ్చిన పుస్తకం?
ఆల్కెమిస్ట్
► గతానికి సంబంధించి ఏదైనా మార్చేసే అవకాశం వస్తే ఏం మారుస్తారు?
ఇప్పటివరకూ జరిగిన ప్రతి విషయం నన్ను మంచి స్థాయిలో నిలబెట్టింది. అందుకే ఏదీ మార్చను.
► ప్రభాస్‌తో ఇంకో సినిమా చేయండి...
మేమిద్దరం జంటగా నటించాల్సిన కథ కుదిరితే తప్పకుండా నటిస్తాం.
► కొత్త సినిమా విశేషాలు చెప్పండి..
త్వరలోనే నిర్మాణ సంస్థల నుంచి అధికారిక ప్రకటన వస్తుంది.
► మీకు స్ఫూర్తిగా నిలిచినవాళ్ల పేర్లు చెప్పండి?
మా అమ్మానాన్న, యోగా గురువు, అలానే నేను ప్రతి రోజూ కలిసేవాళ్లు. అందరూ నాకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment