
అభిమానులకు ఎప్పుడు ఆనందంగా ఉంటుంది? అభిమాన తారతో కలసి ఫొటో దిగినప్పుడు, తాము అడిగిన ప్రశ్నలకు ఆ స్టార్ సమాధానం చెప్పినప్పుడు. ఫ్యాన్స్ తమ నుంచి ఇవి తప్ప వేరే కోరుకోరు కాబట్టి, స్టార్స్ కూడా అప్పుడప్పుడు ఆ అవకాశాలిస్తుంటారు. మిల్కీ బ్యూటీ తమన్నా తన ఫ్యాన్స్‌ని క్వొశ్చన్స్ అడగమన్నారు. ఈ గోల్డెన్స్ ఛాన్స్‌ని మిస్ చేసుకోకుండా ఎంతోమంది ఫ్యాన్స్ తమ్మూతో ‘చాట్’ చేశారు. ఆ విశేషాలు.
► మీరు గర్వంగా ఫీల్ అయ్యేదెప్పుడు?
మా తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నప్పుడు.
► మీ రోల్ మోడల్?
మా ఇంట్లోనే ఉన్నారు.. మా అమ్మగారు.
► తెలుగు లాంగ్వేజ్ గురించి?
వెరీ స్వీట్ లాంగ్వేజ్. నేను తెలుగు మాట్లాడతాను. అయితే మరింత చక్కగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను.
► మీరు టాలీవుడ్‌లోనే ఉండాలి..
ఉంటాను. తెలుగులో మరిన్ని సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తాను.
► మీ స్ట్రెస్ బస్టర్?
ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేయడం.
► మీకిష్టమైన కలర్?
ఈ విషయంలో నా అభిప్రాయాలు మారుతుంటాయి. ప్రజెంట్ నా ఫేవరెట్ కలర్ బ్లాక్.
► మీ బ్యూటీ సీక్రెట్?
హెల్తీ ఫుడ్ అండ్ గుడ్ వర్కౌట్.
► సినిమాలు లేకుండా మీ లైఫ్‌ను ఊహించుకోగలరా..?
లేదు.
► లైఫ్‌లో మీరు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఏంటి?
ఫాలోయింగ్ మై డ్రీమ్స్ అండ్ యాక్టింగ్‌ను నా వృత్తిగా ఎంచుకోవడం.
► మిమ్మల్ని విందుకు ఆహ్వానిస్తే కచ్చితంగా ఉండాల్సిన ఐటమ్ ఏది?
పావ్ బాజీ.
► మీ పేరుకు అర్థం?
డిజైర్ (కోరిక)
► మీకు బాగా సూట్ అయ్యే క్యారెక్టర్ ఏదనుకుంటున్నారు?
ఒక నటిగా ప్రతి పాత్రను బాగా చేయాలని కోరుకుంటాను.
► వ్యతిరేక ఆలోచనలను ఎలా అధిగమిస్తారు?
పాజిటివ్ థింగ్స్‌పై ఫోకస్ చేస్తాను. నెగిటివ్ థింగ్స్‌ను వదిలేస్తాను.
Comments
Please login to add a commentAdd a comment