
తమన్నా
అభిమానులను ప్రత్యేకంగా పలకరించడానికి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చాట్ చేస్తుంటారు తారలు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటారు. అలా శనివారం తమన్నా తన ఫ్యాన్స్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. నెటిజన్ల ప్రశ్నలకు సమాధాలు, కొందరికి సలహాలు ఇచ్చారు. వాటి గురించి తెలుసుకుందాం.
► ఈ ప్రపంచంలో మీకు అత్యంత విలువైనది ఏది?
► నా కుటుంబం ఎంతో విలువైనది.
► మీ ఫేవరెట్ ప్లేస్?
► మా ఇల్లు.
► మీ నిక్ నేమ్?
► తమ్ము.
► స్నేహితుల ప్రాముఖ్యత గురించి?
► మనం డౌన్‌లో ఉన్నప్పుడు మనల్ని వెన్నుతట్టి ప్రోత్సహించేవారే నిజమైన స్నేహితులు.
► అపజయాలను మీరు ఎలా ఎదుర్కొంటారు?
► మన జీవితాన్ని ఒకసారి తిరిగి చూసుకునే అవకాశాన్ని కల్పించేవి అపజయాలే. ఏదైనా కొత్త విషయాన్ని స్టార్ట్ చేయడానికి కూడా అపజయాలే కొన్నిసార్లు స్ఫూర్తినిస్తాయి. అందుకని అపజయాలకు కుంగిపోకండి.
► హార్ట్‌ను ఫాలో కావాలా? బ్రెయిన్‌నా?
► దిల్ సే సునో... దిమాక్ సే కరో! (మనసుతో విను.. బుర్రతో చెయ్).
► మీరెప్పుడు క్రియేటివ్‌గా ఉంటారు?
► నాకు నేనులా ఉండే పరిస్థితులు ఉన్నప్పుడు క్రియేటివ్‌గా ఉంటాను.
► టెన్నిస్‌లో మీరు ఏదైనా బహుమతి అందుకున్నారా?
► ఏదో అలవాటుగా ఆడతాను కానీ పోటీల్లో పాల్గొనను.
► మీ ఫేవరెట్ డిష్?
► పావ్ బాజీ.. (గ్లూటెన్ ఫ్రీ పావ్ మాత్రమే).
► ఫిల్మ్ ఇండస్ట్రీ లైఫ్ గురించి ఒక్క మాటలో...
► సాహసోపేతమైనది.
► ఏ జానర్ అయితే నటిగా మిమ్మల్ని మీరు ఎక్స్‌ప్లోర్ చేసుకోగలరని భావిస్తున్నారు?
► యాక్షన్ కామెడీతో కూడుకున్న హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్.
► నటనను వృత్తిగా తీసుకోవాలనుకున్నప్పుడు మీ ఆలోచనలు ఏంటి?
► ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. కెమెరాను బాగా ఫేస్ చేయాలి.
► గుడ్ స్క్రిప్ట్స్ ఆర్ గుడ్ క్యారెక్టర్?
► సినిమాలు టీమ్ వర్క్‌పై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆర్టిస్టుగా నేనొక మంచి టీమ్‌లో భాగం కావాలని కోరుకుంటాను. నాకొక మంచి క్యారెక్టర్ ఉన్న ఆసక్తికరమైన కథలను ఇష్టపడతాను. నటిగా నిరూపించుకోవ డానికి స్కోప్ ఉందా? అని చూస్తాను.
Comments
Please login to add a commentAdd a comment