
సాక్షి, అమరావతి: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి పదవిపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధాని అవ్వాలన్న కోరిక లేదని, ఆ అర్హత కూడా లేదని అన్నారు. ఫిరాయింపులపై ఫిర్యాదులు వస్తే మూడు నెలల్లో పరిష్కరించాలని ఆయన సూచించారు. ప్రత్యక్ష ప్రసారాలుండటం వల్ల కొందరు సభ్యులు సభలో హడావిడి చేస్తున్నారని అన్నారు. అయితే, సభ్యుల ప్రవర్తన తెలిసేందుకు ప్రత్యక్ష ప్రసారాలు ఉండాలనే అభిప్రాయం కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment