క్యాన్సర్...అయినా డోంట్ కేర్
Published Mon, Jan 6 2014 4:37 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
క్యాన్సర్ బారిన పడిన నటి మమతామోహన్‌దాస్ దాన్ని నుంచి బయటపడడానికి పోరాడుతూనే మరోపక్క నటిగా రాణిస్తున్నారు. కోలీవుడ్‌లో శివప్పధికారం, తడయారతాక్క, గురు ఎన్ ఆళు తదితర చిత్రాల్లో నటించిన మమతా టాలీవుడ్‌లోనూ నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈమె మంచి గాయని కూడా. గత ఏడాది క్యాన్సర్ వ్యాధికి గురైన మమతామోహన్ దాస్ కీమో థెరపీ చేయించుకున్నారు. దీంతో జుట్టు అంతా రాలిపోయి నటనకు దూరమయ్యారు.
చికి త్స అనంతరం కోలుకుని మళ్లీ నటనకు సిద్ధమైన మమతకు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ప్రజిత్ నుంచి విడాకులంటూ మరో షాక్ తగిలింది. అయినా మనోధైర్యంతో దాన్ని ఎదుర్కొన్నారు. మల యాళంలో సెల్యులాయిడ్, లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, ముసాబీర్, పైసా పైసా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ఈమెకు క్యాన్సర్ తిరగబెట్టింది. చికిత్స కోసం మళ్లీ నట నకు దూరమయ్యారు. ప్రస్తుతం కాస్త కోలుకోవడంతో ఒక పక్క నటించడానికి సిద్ధమయ్యారు. ఆమె ఇప్పుడు డునూర్ విత్ లవ్ అనే మల యాళ చిత్రంలో నటిస్తున్నారు. క్యాన్సర్ అంటూ చింతిస్తూ కూర్చొంటే అది పోతుందా? అందుకే మమత క్యాన్సర్ అయినా డోంట్ కేర్ అంటూ దూసుకుపోతోంది.
Advertisement
Advertisement