జై బోలో తెలంగాణ లాంటి సూపర్ హిట్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న దర్శకుడు ఎన్. శంకర్ త్వరలో 2 కంట్రీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ సినిమా 2 కంట్రీస్ ను అదే పేరుతో తెలుగులో స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘ఇన్నాళ్లు కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేశా.. ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం లేకుండా చేశా. ఈ సినిమా కూడా అదే తరహాలో ఉంటుంది.
2 కంట్రీస్ మలయాళ చిత్ర టీం నాకు మంచి మిత్రులు. వారే నేను ఈ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుందన్నారు. షారూఖ్ లాంటి స్టార్ హీరోలు కూడా ఈ సినిమా గురించి స్పందించటంతో నాకు ఆసక్తి కలిగింది. అందుకే నేనే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించాను. దాదాపు 40 మంది 40 రోజుల పాటు అమెరికాలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ చేశాం.
చాలా కొత్త లొకేషన్లలో సినిమాలు తెరకెక్కించాం. సినిమా చాలా రిచ్ గా గ్రాండ్ గా ఉంటుంది. ముఖ్యంగా రామ్ ప్రసాద్‌గారి సినిమాటోగ్రఫి కారణంగా సినిమాకు రిచ్ లుక్ వచ్చింది. మలయాళంలో ఐదారు సినిమాలతో బిజీగా ఉన్నా.. గోపిసుందర్ టైం ఇచ్చి ఈ సినిమాకు పని చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వచ్చింది. రీ రికార్డింగ్ చేసిన తరువాత చూసిన ఒరిజినల్ వర్షన్ దర్శక నిర్మాతలు సినిమా ఘనవిజయం సాధిస్తుందన్నారు.
మలయాళ వర్షన్ కంటే తెలుగు 2 కంట్రీస్ బాగుంటుంది. సునీల్ బాడీ లాంగ్వేజ్, ఏజ్ కు తగ్గ క్యారెక్టర్ ఇది. మలయాళంలో మమతా మోహన్ దాస్ హీరోయిన్ చేశారు. తెలుగులో హీరోయిన్ పాత్ర కోసం చాలా మందిని సంప్రదించాం. కానీ ఎవరూ ఇంట్రస్ట్ చూపించలేదు.. కొంత మంది డేట్స్ లేవన్నారు. తరువాత అమెరికాలో పుట్టి పెరిగిన మనీషా రాజ్ ను ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశాం. తొలి సినిమానే అయినా హావభావాల్లో సునీల్ ని డామినేట్ చేసింది మనీషా. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment