Manisha Raj
-
ఈ అవకాశం రావడం వైష్ణవ్ అదృష్టం
చిరంజీవి కుటుంబం నుంచి మరో హీరో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. చిరంజీవి మేనల్లుడు, సాయిదరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు నిర్మించనున్న ఈ చిత్రాన్ని సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్స్ వైష్ణవ్ తేజ్, మనీషా రాజ్‌లపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, చిరంజీవి క్లాప్ ఇచ్చారు. నాగబాబు, అల్లు అర్జున్ స్క్రిప్ట్‌ను టీమ్‌కు అందించారు. ఈ సినిమా షూటింగ్ మార్చి మొదటి వారం నుంచి స్టార్ట్ కానుంది. ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ – ‘‘మైత్రీ మూవీస్ గురించి, ఆ సంస్థ అందించిన విజయాల గురించి అందరికీ తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్ ద్వారా కొత్తవాళ్లను ప్రోత్సహిస్తున్నందుకు సుకుమార్‌ని అభినందిస్తున్నాను. ‘రంగస్థలం’ సినిమాతో సుకుమార్, మైత్రీ వాళ్లతో నాకు అనుబంధం ఏర్పడింది. వైష్ణవ్‌కి ఇంత మంచి అవకాశం రావడం అదృష్టం. ఈ అవకాశాన్ని వైష్ణవ్ సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. బుచ్చిబాబు కొత్త కథ రాశాడు. ‘రంగస్థలం’ కథా చర్చల్లో బుచ్చిబాబు పాత్ర ఎంతో ఉందని సుకుమార్ నాతో చెప్పారు’’ అన్నారు. ‘‘ఈ ప్రాజెక్ట్‌లో సుకుమార్ కూడా భాగమైనప్పుడు ఈ సినిమా డిఫరెంట్‌గా ఉంటుందనుకున్నాను. వైష్ణవ్, మనీషాకు నా అభినందనలు. దర్శకుడు అడిగిందల్లా ఇచ్చే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్. దేవిశ్రీ కూడా తోడై ఈ సినిమా స్టామినా పెంచేశారు’’ అన్నారు అల్లు అరవింద్. ‘‘బుచ్చిబాబు అద్భుతమైన కథ రాశాడు. నా శిష్యుడు ఈ సినిమా చేస్తున్నందుకు గర్వంగా ఉంది. వైష్ణవ్ కోసమే ఈ కథ పుట్టింది. కథ రాస్తున్నప్పుడే వైష్ణవ్ హీరో అని ఫిక్స్ అయ్యాడు బుచ్చి. మైత్రీ వాళ్లకు థ్యాంక్స్. పెద్ద సినిమాలు నిర్మిస్తూ, చిన్న సినిమాలనూ నిర్మించడం వారికే సొంతం. దేవిశ్రీ ప్రసాద్‌కు థ్యాంక్స్. వైష్ణవ్‌కి మంచి భవిష్యతు ఉంది. కథ ఇంత బాగా రావడానికి కారణం చిరంజీవిగారే. ఆయన చాలా ఇన్‌ఫుట్స్ ఇచ్చారు’’ అన్నారు సుకుమార్. ‘‘కథ చాలా అద్భుతంగా వచ్చింది. హీరో, హీరోయిన్ సినిమాకు సరిగ్గా సరిపోయారు’’ అన్నారు నిర్మాత నవీన్ యర్నేని. ‘‘సుకుమార్‌గారికి థ్యాంక్స్ అని చెప్పడం చిన్న పదం అయిపోతుంది. నన్ను నమ్మిన అమ్మా నాన్నలకు, చిరంజీవిగారికి థ్యాంక్స్. ఈ సినిమా కొత్తగా ఉంటుంది. నిర్మాతలకు, దేవిశ్రీ ప్రసాద్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు బుచ్చిబాబు. ఈ కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారికా, దేవిశ్రీ ప్రసాద్, వైష్ణవ్ తేజ్ తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
'2 కంట్రీస్' మూవీ రివ్యూ
టైటిల్ : 2 కంట్రీస్ జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : సునీల్, మనీషా రాజ్, శ్రీనివాస్ రెడ్డి, నరేష్, 30 ఇయర్స్ పృథ్వీ సంగీతం : గోపీ సుందర్ నిర్మాత, దర్శకత్వం : ఎన్. శంకర్ హాస్యనటుడిగా మంచి ఫాంలో ఉండగానే హీరోగా టర్న్ తీసుకున్న సునీల్.. కథానాయకుడిగా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోతున్నాడు. హీరోగా ఒకటి రెండు విజయాలు దక్కినా.. వరుస ఫ్లాప్ లతో కెరీర్ కష్టాల్లో పడింది. జై బోలో తెలంగాణ లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత దర్శకుడు ఎన్ శంకర్ మలయాళ సినిమాకు రీమేక్ గా రూపొందించిన 2 కంట్రీస్ తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు సునీల్. మరీ ఈ సినిమాతో అయినా సునీల్ హీరోగా సక్సెస్ సాధిస్తాడా..? లాంగ్ గ్యాప్ తరువాత వచ్చిన ఎన్.శంకర్ మరో విజయాన్ని సాధించాడా..? కథ : ఉల్లాస్ కుమార్ (సునీల్) బాధ్యత లేకుండా ఈజీ మనీ కోసం ప్రయత్నించే పల్లెటూరి కుర్రాడు. తను డబ్బు సంపాదించటం కోసం ప్రాణ స్నేహితులను, కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందుల్లోకి నెడుతుంటాడు. పటేల్ అనే రౌడీ దగ్గర తను తీసుకున్న అప్పును తీర్చలేక వాళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. (సాక్షి రివ్యూస్) అయితే అదే సమయంలో ఫారిన్ లో సెటిల్ అయిన తన చిన్ననాటి స్నేహితురాలు లయ (మనీషా రాజ్)తో పరిచయం అవుతుంది. ఆమె కోట్ల ఆస్తిని సొంతం చేసుకోవాలన్న ఆశతో పటేల్ వాళ్ల సంబంధం కాదని లయను పెళ్లి చేసుకుంటాడు. చిన్నతనంలో అమ్మ నాన్నలు విడిపోవటంతో లయ మద్యానికి బానిసవుతుంది. ఉల్లాస్ అయితే తన అలవాట్లకు అడ్డురాడన్న నమ్మకంతో అతడితో పెళ్లికి అంగీకరిస్తుంది. అయితే పెళ్లి తరువాత లయ గురించి నిజం తెలుసుకున్న ఉల్లాస్, లయతో మందు మాన్పించే ప్రయత్నం చేస్తాడు. లయ గతం తెలుసుకొని ప్రేమతో ఆమెను మామూలు మనిషిని చేయాలనుకుంటాడు. ఉల్లాస్ ప్రేమను లయ అర్థం చేసుకుందా..? ఈ ప్రయత్నంలో ఉల్లాస్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నదే మిగతా కథ. నటీనటులు : హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టాలు పడుతున్న సునీల్, 2 కంట్రీస్ సినిమా విజయం కోసం తనవంతు ప్రయత్నం చేశాడు. తనకు అలవాటైన కామెడీ టైమింగ్ తో అలరించాడు. సెంటిమెంట్ సీన్స్ లోనూ సునీల్ నటన ఆకట్టుకుంటుంది. తొలి సినిమానే అయినా మనీషా రాజ్ మంచి నటన కనబరిచింది. (సాక్షి రివ్యూస్) మద్యానికి బానిసైన పొగరుబోతు అమ్మాయి పాత్రలో చాలా బాగా నటించింది. హీరో ఫ్రెండ్ పాత్రలో శ్రీనివాస్ రెడ్డి కామెడీ బాగుంది. ఇతర పాత్రల్లో 30 ఇయర్స్ పృథ్వీ, నరేష్ తదితరులు తమ పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. విశ్లేషణ : మలయాళంలో ఘనవిజయం సాధించిన సినిమాను తెలుగు ప్రేక్షకులను అలరించేలా తెరకెక్కించటంలో దర్శకుడు ఎన్.శంకర్ ఫెయిల్ అయ్యాడు. సునీల్ గత చిత్రాల్లో కనిపించిన రొటీన్ కామెడీ సన్నివేశాలతో సినిమాను నడిపించిన దర్శకుడు నిరాశపరిచాడు. రెండు గంటల 40 నిమిషాల సినిమా నిడివి కూడా ప్రేక్షకుల సహనానికి పరీక్షలా అనిపిస్తుంది. గోపిసుందర్ సంగీతం పరవాలేదనిపిస్తుంది. రెండు పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. (సాక్షి రివ్యూస్) సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ రాం ప్రసాద్ సినిమాటోగ్రఫి. పల్లెటూరి అందాలతో పాటు ఫారిన్ లొకేషన్స్ ను కూడా చాలా బాగా చూపించారు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణవిలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : సినిమాటోగ్రఫి కొన్ని కామెడీ సీన్స్ మైనస్ పాయింట్స్ : కథా కథనం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
నవ్వుతూ సెండాఫ్ చెబుతారు
‘‘హీరో అయిపోవాలనుకోగానే ఎవరూ అయిపోరు. నా విషయంలోనూ అంతే. కమెడియన్‌గా మంచి సక్సెస్ చూశా. ప్రేక్షకులకు అంతలా దగ్గరయ్యాను కాబట్టే హీరోగా అవకాశాలొచ్చాయి’’ అని హీరో సునీల్ అన్నారు. సునీల్, మనీషారాజ్ జంటగా ఎన్. శంకర్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘2 కంట్రీస్’ రేపు విడుదలవుతోంది. సునీల్ పంచుకున్న విశేషాలు... ► ప్రస్తుతం నా ఇమేజ్‌కి సూట్ అయ్యే సినిమా ‘2 కంట్రీస్’. 95% కామెడీ ఉండటంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ సినిమాకి ఓకే చెప్పేశా. మిగిలిన 5% క్లైమాక్స్‌కి ముందు హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉంటాయి. ►మలయాళ ‘2 కంట్రీస్’ సినిమాకి ఇది రీమేక్ అయినా తెలుగులో పెద్దగా మార్పులు చేయలేదు. సెకండాఫ్‌లో స్లో అనిపించినప్పుడు సీన్స్ కొంచెం షార్ప్ చేశామే కానీ, కథలో మార్పులు చేర్పులు చేయలేదు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఒక ఊళ్లో ఉండే పాత్ర నాది. ఈ ఏడాది చివరలో వస్తున్నాం కాబట్టి ప్రేక్షకులు నవ్వుతూ 2017కి సెండాఫ్ చెబుతారు. అది మాత్రం గ్యారంటీ. ►గతంతో పోల్చితే కామెడీ సినిమాలు తగ్గాయి. బాపు, జంధ్యాల, ఈవీవీగార్లలా కామెడీ సినిమాలు చేసేవాళ్లు ఇప్పుడు అంతగా లేరు. త్రివిక్రమ్ నాతో ‘బంతి’ సినిమా చేస్తానన్నాడు. ఇప్పుడు తను ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్నాడు. నాతో గల్లీ క్రికెట్ ఆడమని చెప్పలేను. ►పాత్ర బాగుంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడానికి అభ్యంతరం లేదు. గ్యాప్ వచ్చినా పర్లేదు కానీ, ఇకపై మంచి సినిమా అయితేనే హీరోగా చేస్తా. ‘అందాల రాముడు’ తర్వాత ‘మర్యాద రామన్న’ వంటి చిత్రం వచ్చే వరకు 5 ఏళ్లు వెయిట్ చేశానే కానీ, నచ్చకపోతే చేయలేదు. ఇప్పుడూ అంతే. ►ఈ ఏడాది వచ్చిన నా సినిమాల్లో ‘2 కంట్రీస్’ బెస్ట్ సినిమా అవుతుంది. రెండు సినిమాలు కమెడియన్‌గా ఓకే చేశా. హీరోగా కథలు వింటున్నా. -
2 కంట్రీస్ హిట్ ఆ సినిమాకి ఆక్సిజన్ అవుతుంది
సునీల్, మనీషా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘2 కంట్రీస్’. మహాలక్ష్మీ ఆర్ట్స్ పతాకం పై ఎన్. శంకర్ స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ఈ నెల 29న చిత్రం విడుదల కానున్న సందర్భంగా ఎన్.శంకర్ పాత్రికేయులతో ముచ్చటించారు. ► మలయాళ చిత్రం ‘2 కంట్రీస్’ తీసినవాళ్లు నా మిత్రులే. అక్కడ మంచి విజయం సాధించటంతో తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందన్నారు. మలయాళ చిత్రంలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా మన నేటివిటీకి తగ్గ మార్పులతో, నా మార్క్ హ్యూమన్ ఎమోషన్స్‌తో సినిమా తెరకెక్కించాం. ఈ సినిమాను చూసి మాతృక తీసిన చిత్రబృందం అభినందించారు. మలయాళీలు సినిమాలను బాగా అడాప్ట్ చేసుకుంటారు. వాళ్లు ఈ సినిమాను మెచ్చుకోవటం ఆనందం కలిగించింది. రాంప్రసాద్ విజువల్స్, గోపీసుందర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అవుతాయి. ► సినిమాలో హీరోకి ఎలాంటి లక్ష్యం ఉండదు. ఈజీ మనీ కోసం ఏదైనా చేయాలనుకునే తత్వం ఉన్న అతని లైఫ్‌లోకి నిజమైన ప్రేమ ఎలా ఎంటర్ అయింది? అతన్ని ఎలా మార్చేసింది అనే కాన్సెప్ట్‌తో సినిమా ఉంటుంది. క్లైమాక్స్ హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. దీలీప్ చేసిన ఈ పాత్ర సునీల్ బాడీ లాంగ్వేజ్‌కు బాగా సూట్ అయింది. ఈ సినిమా సునీల్‌కు మంచి హిట్ అవుతుంది. ► హీరోయిన్ మనీషా రాజ్ మా ఫ్రెండ్ వాళ్ల డాటర్‌కి ఫ్రెండ్. ఆ అమ్మాయి సింగర్ కావాలనుకుంది. కానీ, నాకు హీరోయిన్గా బావుంటుందనిపించింది. కొత్త అమ్మాయి అయినా చాలా చక్కగా నటించింది. మనీషాకి మంచి పేరొస్తుంది. ► సినిమాను చాలా రిచ్‌గా తీశాం. అమెరికాలో 45 డేస్ షెడ్యూల్ జరిపాం. ఈ సినిమాను హిందీలో కూడా చేయబోతున్నాం. అజయ్ దేవగన్ హీరోగా ఫిక్స్ అయ్యారు. హిందీలో టీ సిరీస్‌తో కలిసి మరికొందరి స్నేహితులతో కలసి నిర్మించబోతున్నాను. ఇంకా దర్శకుడు ఫైనలైజ్ కావాలి. ► సునీల్‌కు మార్కెట్ లేదు. వేరే నిర్మాత అయితే అమెరికా ఎందుకు? బ్యాంకాక్‌లో తీద్దాం అంటారు. అది నాలోని టెక్నీషియన్‌కు నచ్చదు. అందుకే నేనే నిర్మాతగా మారాను. నెక్ట్స్ కొత్తవాళ్లతో ఓ సినిమా చేయబోతున్నాను. ‘2 కంట్రీస్’ హిట్ అయ్యి ఆ చిత్రానికి ఆక్సిజన్‌లా ఉంటుందని అనుకుంటున్నాను. ► కమల్‌హాసన్‌తో కథ ఓకే అయింది. నిర్మాతలు దొరకలేదు. అందుకే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. -
ఆ చిన్నారే ఇప్పుడు నా హీరోయిన్ అయింది!
సాక్షి, సినిమా: నటుడు సునీల్ ఒకప్పుడు తాను ఎత్తుకున్న పాపే తనతో హీరోయిన్గా నటిస్తుందని తెలిపారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం '2 కంట్రీస్' ఈ నెల 29న తెరపైకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఓ సంఘటనను గుర్తుచేశారు. ‘సొంతం సినిమా షూటింగ్ కోసం ఫారిన్ వెళ్లినప్పుడు తమ కుమార్తెను ఎత్తుకోమని ఓ దంపతులు నన్ను కలిశారన్నారు. ఆ అమ్మాయిని ఎత్తుకున్న నాతో ఓ ఫొటో దిగారు. ఆ అమ్మాయే 2 కంట్రీస్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది’ అని సునీల్ తెలిపారు. తొలిరోజు షూటింగ్ అయిన తర్వాత మనీషా రాజ్ తండ్రి సునీల్‌ని కలిసి ‘చాలా రోజుల క్రితం మా పాపను ఎత్తుకున్నారు. ఆ సమయంలో మేం మీతో ఫొటో దిగామని అని చెప్పారు. ఆ ఫొటోలో ఉన్న పాపే ఇప్పుడు నీతో హీరోయిన్గా చేస్తుంది’ అని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న సునీల్ ఆశ్యర్యానికి లోనయ్యానని చెప్పారు. సునీల్ కామెడీ పాత్రలతో తన సినిమా జీవితాన్ని మొదలుపెట్టాడు. కమెడీయన్‌గా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే 'అందాల రాముడు'తో హీరోగా మారారు. ఆ సినిమా తరువాత కూడా హాస్య పాత్రలకే పరిమితమైన సునీల్.. 'మర్యాద రామన్న' తరువాత హీరో వేషాలవైపే దృష్టి పెట్టారు. అయితే సునీల్ మళ్ళీ హాస్య పాత్రలు చేసేందుకు ఆయన సిద్ధమయినట్ల వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్, ఎన్టీఆర్ చిత్రంలో, రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలోనూ కామెడీ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలోస్తున్నాయి. -
ఎవరూ ఇంట్రస్ట్ చూపించలేదు : ఎన్. శంకర్
జై బోలో తెలంగాణ లాంటి సూపర్ హిట్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న దర్శకుడు ఎన్. శంకర్ త్వరలో 2 కంట్రీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ సినిమా 2 కంట్రీస్ ను అదే పేరుతో తెలుగులో స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘ఇన్నాళ్లు కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేశా.. ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం లేకుండా చేశా. ఈ సినిమా కూడా అదే తరహాలో ఉంటుంది. 2 కంట్రీస్ మలయాళ చిత్ర టీం నాకు మంచి మిత్రులు. వారే నేను ఈ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుందన్నారు. షారూఖ్ లాంటి స్టార్ హీరోలు కూడా ఈ సినిమా గురించి స్పందించటంతో నాకు ఆసక్తి కలిగింది. అందుకే నేనే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించాను. దాదాపు 40 మంది 40 రోజుల పాటు అమెరికాలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. చాలా కొత్త లొకేషన్లలో సినిమాలు తెరకెక్కించాం. సినిమా చాలా రిచ్ గా గ్రాండ్ గా ఉంటుంది. ముఖ్యంగా రామ్ ప్రసాద్‌గారి సినిమాటోగ్రఫి కారణంగా సినిమాకు రిచ్ లుక్ వచ్చింది. మలయాళంలో ఐదారు సినిమాలతో బిజీగా ఉన్నా.. గోపిసుందర్ టైం ఇచ్చి ఈ సినిమాకు పని చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వచ్చింది. రీ రికార్డింగ్ చేసిన తరువాత చూసిన ఒరిజినల్ వర్షన్ దర్శక నిర్మాతలు సినిమా ఘనవిజయం సాధిస్తుందన్నారు. మలయాళ వర్షన్ కంటే తెలుగు 2 కంట్రీస్ బాగుంటుంది. సునీల్ బాడీ లాంగ్వేజ్, ఏజ్ కు తగ్గ క్యారెక్టర్ ఇది. మలయాళంలో మమతా మోహన్ దాస్ హీరోయిన్ చేశారు. తెలుగులో హీరోయిన్ పాత్ర కోసం చాలా మందిని సంప్రదించాం. కానీ ఎవరూ ఇంట్రస్ట్ చూపించలేదు.. కొంత మంది డేట్స్ లేవన్నారు. తరువాత అమెరికాలో పుట్టి పెరిగిన మనీషా రాజ్ ను ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశాం. తొలి సినిమానే అయినా హావభావాల్లో సునీల్ ని డామినేట్ చేసింది మనీషా. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది’ అని తెలిపారు. -
డిసెంబర్లో రెండు దేశాలు
సునీల్ కథానాయకుడిగా మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఎన్. శంకర్ నిర్మించిన చిత్రం ‘2 కంట్రీస్’. మనీషా రాజ్ కథానాయిక. మలయాళ సినిమా ‘2 కంట్రీస్’కి తెలుగు రీమేక్ ఇది. ఈ సినిమా టీజర్‌ను హీరో పవన్ కల్యాణ్ లాంచ్ చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘టీజర్‌ను నా చేతుల మీదుగా లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘టీజర్‌ను లాంచ్ చేయడమే కాకుండా, బాగుందని మెచ్చుకున్న పవన్ కల్యాణ్‌కు రుణపడి ఉంటాను’’ అన్నారు సునీల్. ‘‘టీజర్‌ను ఆవిష్కరించిన పవన్‌కల్యాణ్‌గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డిసెంబర్లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు ఎన్. శంకర్. -
కంట్రీస్ క్లైమాక్స్@ హైదరాబాద్!
సునీల్ హీరోగా మహాలక్ష్మీ ఆర్ట్స్ పతాకంపై ఎన్. శంకర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా ‘టూ కంట్రీస్’. మనీషా రాజ్ హీరోయిన్. మలయాళంలో మంచి విజయం సాధించిన ‘టూ కంట్రీస్’కు తెలుగు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో దర్శక–నిర్మాత ఎన్. శంకర్ మాట్లాడుతూ– ‘‘మన సంస్కృతి–సంప్రదాయలు, కుటుంబ విలువల నేపథ్యంలో ఆలుమగల అనుబంధానికి ప్రతీకగా రూపొందుతోన్న చిత్రమిది. ఆద్యంతం నవ్వుల్ని పంచే విధంగా తెరకెక్కిస్తున్నాను. అమెరికాలో 32 రోజుల పాటు కీలక సన్నివేశాలు తీశాం. ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్‌తో ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తయినట్టే’’ అన్నారు. ‘‘నేను చేసిన మలయాళ రీమేక్స్ మంచి హిట్టయ్యాయి. సెంటిమెంట్ కింద చూసినా ఈ సినిమా మంచి హిట్టవుతుంది. శంకర్‌గారు ప్రేక్షకుల్ని నవ్విస్తూ, విలువలు చెప్పేలా సినిమా తీస్తున్నారు’’ అన్నారు సునీల్. ఈ కార్యక్రమంలో చంద్రమోహన్, రాజ్యలక్ష్మి, పృథ్వీ, కృష్ణ భగవాన్, శ్రీనివాసరెడ్డి, దేవ్ గిల్, షాయాజీ షిండే, రాజా రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.