కంట్రీస్‌ క్లైమాక్స్‌@ హైదరాబాద్‌! | The shooting of the film is too countryes currently going on in Hyderabad. | Sakshi
Sakshi News home page

కంట్రీస్‌ క్లైమాక్స్‌ @ హైదరాబాద్‌!

Published Mon, Jul 31 2017 12:14 AM | Last Updated on Thu, Apr 4 2019 4:46 PM

కంట్రీస్‌ క్లైమాక్స్‌@ హైదరాబాద్‌! - Sakshi

కంట్రీస్‌ క్లైమాక్స్‌@ హైదరాబాద్‌!

సునీల్‌ హీరోగా మహాలక్ష్మీ ఆర్ట్స్‌ పతాకంపై ఎన్‌. శంకర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా ‘టూ కంట్రీస్‌’. మనీషా రాజ్‌ హీరోయిన్‌. మలయాళంలో మంచి విజయం సాధించిన ‘టూ కంట్రీస్‌’కు తెలుగు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో దర్శక–నిర్మాత ఎన్‌. శంకర్‌ మాట్లాడుతూ– ‘‘మన సంస్కృతి–సంప్రదాయలు, కుటుంబ విలువల నేపథ్యంలో ఆలుమగల అనుబంధానికి ప్రతీకగా రూపొందుతోన్న చిత్రమిది.

ఆద్యంతం నవ్వుల్ని పంచే విధంగా తెరకెక్కిస్తున్నాను. అమెరికాలో 32 రోజుల పాటు కీలక సన్నివేశాలు తీశాం. ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్‌తో ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తయినట్టే’’ అన్నారు. ‘‘నేను చేసిన మలయాళ రీమేక్స్‌ మంచి హిట్టయ్యాయి. సెంటిమెంట్‌ కింద చూసినా ఈ సినిమా మంచి హిట్టవుతుంది. శంకర్‌గారు ప్రేక్షకుల్ని నవ్విస్తూ, విలువలు చెప్పేలా సినిమా తీస్తున్నారు’’ అన్నారు సునీల్‌. ఈ కార్యక్రమంలో చంద్రమోహన్, రాజ్యలక్ష్మి, పృథ్వీ, కృష్ణ భగవాన్, శ్రీనివాసరెడ్డి, దేవ్‌ గిల్, షాయాజీ షిండే, రాజా రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement