సునీల్, మనీషా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘2 కంట్రీస్’. మహాలక్ష్మీ ఆర్ట్స్ పతాకం పై ఎన్. శంకర్ స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ఈ నెల 29న చిత్రం విడుదల కానున్న సందర్భంగా ఎన్.శంకర్ పాత్రికేయులతో ముచ్చటించారు.
► మలయాళ చిత్రం ‘2 కంట్రీస్’ తీసినవాళ్లు నా మిత్రులే. అక్కడ మంచి విజయం సాధించటంతో తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందన్నారు. మలయాళ చిత్రంలో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా మన నేటివిటీకి తగ్గ మార్పులతో, నా మార్క్ హ్యూమన్ ఎమోషన్స్‌తో సినిమా తెరకెక్కించాం. ఈ సినిమాను చూసి మాతృక తీసిన చిత్రబృందం అభినందించారు. మలయాళీలు సినిమాలను బాగా అడాప్ట్ చేసుకుంటారు. వాళ్లు ఈ సినిమాను మెచ్చుకోవటం ఆనందం కలిగించింది. రాంప్రసాద్ విజువల్స్, గోపీసుందర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అవుతాయి.
► సినిమాలో హీరోకి ఎలాంటి లక్ష్యం ఉండదు. ఈజీ మనీ కోసం ఏదైనా చేయాలనుకునే తత్వం ఉన్న అతని లైఫ్‌లోకి నిజమైన ప్రేమ ఎలా ఎంటర్ అయింది? అతన్ని ఎలా మార్చేసింది అనే కాన్సెప్ట్‌తో సినిమా ఉంటుంది. క్లైమాక్స్ హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. దీలీప్ చేసిన ఈ పాత్ర సునీల్ బాడీ లాంగ్వేజ్‌కు బాగా సూట్ అయింది. ఈ సినిమా సునీల్‌కు మంచి హిట్ అవుతుంది.
► హీరోయిన్ మనీషా రాజ్ మా ఫ్రెండ్ వాళ్ల డాటర్‌కి ఫ్రెండ్. ఆ అమ్మాయి సింగర్ కావాలనుకుంది. కానీ, నాకు హీరోయిన్‌గా బావుంటుందనిపించింది. కొత్త అమ్మాయి అయినా చాలా చక్కగా నటించింది. మనీషాకి మంచి పేరొస్తుంది.
► సినిమాను చాలా రిచ్‌గా తీశాం. అమెరికాలో 45 డేస్ షెడ్యూల్ జరిపాం. ఈ సినిమాను హిందీలో కూడా చేయబోతున్నాం. అజయ్ దేవగన్ హీరోగా ఫిక్స్ అయ్యారు. హిందీలో టీ సిరీస్‌తో కలిసి మరికొందరి స్నేహితులతో కలసి నిర్మించబోతున్నాను. ఇంకా దర్శకుడు ఫైనలైజ్ కావాలి.
► సునీల్‌కు మార్కెట్ లేదు. వేరే నిర్మాత అయితే అమెరికా ఎందుకు? బ్యాంకాక్‌లో తీద్దాం అంటారు. అది నాలోని టెక్నీషియన్‌కు నచ్చదు. అందుకే నేనే నిర్మాతగా మారాను. నెక్ట్స్ కొత్తవాళ్లతో ఓ సినిమా చేయబోతున్నాను. ‘2 కంట్రీస్’ హిట్ అయ్యి ఆ చిత్రానికి ఆక్సిజన్‌లా ఉంటుందని అనుకుంటున్నాను.
► కమల్‌హాసన్‌తో కథ ఓకే అయింది. నిర్మాతలు దొరకలేదు. అందుకే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment