ఆ చిన్నారే ఇప్పుడు నా హీరోయిన్‌ అయింది! | sunil says about heroine manisha raj | Sakshi
Sakshi News home page

ఆ చిన్నారే ఇప్పుడు నా హీరోయిన్‌ అయింది!

Published Tue, Dec 26 2017 7:50 PM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM

sunil says about heroine manisha raj - Sakshi

సాక్షి, సినిమా: న‌టుడు సునీల్ ఒకప్పుడు తాను ఎత్తుకున్న పాపే తనతో హీరోయిన్‌గా నటిస్తుందని తెలిపారు. ఆయన హీరోగా న‌టించిన తాజా చిత్రం '2 కంట్రీస్' ఈ నెల 29న తెర‌పైకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఓ సంఘటనను గుర్తుచేశారు. ‘సొంతం సినిమా షూటింగ్ కోసం ఫారిన్ వెళ్లినప్పుడు  తమ కుమార్తెను ఎత్తుకోమని ఓ దంపతులు నన్ను కలిశారన్నారు. ఆ అమ్మాయిని ఎత్తుకున్న నాతో ఓ ఫొటో  దిగారు. ఆ అమ్మాయే  2 కంట్రీస్‌ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది’ అని సునీల్ తెలిపారు. 

తొలిరోజు షూటింగ్ అయిన తర్వాత మనీషా రాజ్ తండ్రి సునీల్‌ని కలిసి ‘చాలా రోజుల క్రితం మా పాపను ఎత్తుకున్నారు. ఆ సమయంలో మేం మీతో ఫొటో దిగామని అని చెప్పారు. ఆ ఫొటోలో ఉన్న పాపే ఇప్పుడు నీతో హీరో‌యిన్‌గా చేస్తుంది’ అని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న సునీల్‌ ఆశ్యర్యానికి లోనయ్యానని చెప్పారు. 

సునీల్ కామెడీ పాత్రల‌తో తన సినిమా జీవితాన్ని మొదలుపెట్టాడు. క‌మెడీయ‌న్‌గా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే 'అందాల రాముడు'తో హీరోగా మారారు. ఆ సినిమా త‌రువాత కూడా హాస్య పాత్రల‌కే ప‌రిమిత‌మైన సునీల్‌.. 'మ‌ర్యాద రామ‌న్న' త‌రువాత హీరో వేషాల‌వైపే దృష్టి పెట్టారు. అయితే సునీల్‌ మ‌ళ్ళీ హాస్య పాత్రలు చేసేందుకు ఆయ‌న సిద్ధమయినట్ల వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్‌, ఎన్టీఆర్ చిత్రంలో, ర‌వితేజ‌, శ్రీ‌ను వైట్ల కాంబినేష‌న్‌లో తెర‌కెక్కనున్న సినిమాలోనూ కామెడీ రోల్ చేయ‌డానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చార‌ని వార్తలోస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement