యాక్టర్‌ టు ప్రొడ్యూసర్‌ | Mamtha Mohandas turns producer | Sakshi
Sakshi News home page

యాక్టర్‌ టు ప్రొడ్యూసర్‌

Published Fri, Oct 23 2020 12:08 AM | Last Updated on Fri, Oct 23 2020 12:08 AM

Mamtha Mohandas turns producer - Sakshi

మమతా మోహన్‌దాస్‌

‘రాఖీ, యమదొంగ, కింగ్‌’ తదితర సినిమాల్లో హీరోయిన్‌గా తెలుగు ఆడియన్స్‌కి మమతా మోహన్‌దాస్‌ పరిచయమే. ‘రాఖీ’ సినిమాకి పాడిన ‘రాఖీ రాఖీ రాఖీ..’, ‘శంకర్‌దాదా జిందాబాద్‌’కి  పాడిన ‘ఆకలేస్తే అన్నం పెడ్తా’, ‘యమదొంగ’కి పాడిన ‘ఓలమ్మీ తిక్కరేగిందా..’ తదితర పాటల ద్వారా గాయనిగానూ ఆమె మంచి మార్కులు సంపాదించుకున్నారు. ప్రస్తుతం మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తున్నారామె. తాజాగా నిర్మాతగా మారారు.

మమతా మోహన్‌దాస్‌ ప్రొడక్షన్స్‌ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారామె. ఈ విషయం గురించి మమతా మోహన్‌దాస్‌ మాట్లాడుతూ – ‘‘నిర్మాణంలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. కల నిజం అవుతున్నట్టుంది. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉన్న అందరికీ ధన్యవాదాలు. నన్ను ఇంత ఆదరించిన ఇండస్ట్రీకి తిరిగి ఇవ్వాలనే ఆలోచన నుంచే ఈ నిర్మాణ సంస్థను స్థాపించాను’’ అన్నారు. తొలి ప్రయత్నంగా ఒక లేడీ ఓరియంటెడ్‌ సినిమా తెరకెక్కించనున్నారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement