
ఆ ఇద్దరి చిత్రం ఎప్పుడు?
శివకార్తికేయన్, నయనతార తొలిసారిగా కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి వేలైకారన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇదే టైటిల్‌తో ఇంతకు ముందు రజనీకాంత్, అమలా జంటగా నటించిన సూపర్‌హిట్ చిత్రం వచ్చిందన్నది గమనార్హం. కాగా ఈ తాజా వేలైకారన్ చిత్రాన్ని మోహన్‌రాజా దర్శకత్వంలో 24 స్టూడియోస్ పతాకంపై ఆర్‌డీ.రాజా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.
ఇందులో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కారణం శివకార్తికేయన్, నయనతారల కాంబినేషన్ ఒకటి కాగా శివకార్తికేయన్ రెమో వంటి సంచలన విజయం సాధించిన తరువాత నటిస్తున్న చిత్రం కావడం మరో కారణం. ఈ చిత్రం గురించి చిత్ర నిర్మాత తాజాగా వెల్లడించిన విషయం ఏమిటంటే వేలైకారన్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోందని చెప్పారు.
మరో పక్క నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. బయ్యర్ల కోరిక మేరకు వేలైకారన్ చిత్రాన్ని సెప్టెంబర్ 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇక చిత్ర ఫస్ట్‌లుక్‌ను జూన్ నెల 5వ తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.