సూపర్‌ హిట్‌కి సీక్వెల్‌ | Mohan Raja, Jayam Ravi announce Thani Oruvan 2 | Sakshi
Sakshi News home page

సూపర్‌ హిట్‌కి సీక్వెల్‌

Published Wed, Aug 29 2018 12:54 AM | Last Updated on Wed, Aug 29 2018 12:54 AM

Mohan Raja, Jayam Ravi announce Thani Oruvan 2 - Sakshi

ఆగస్ట్‌ 28.. ‘జయం’ రవి, అతని సోదరుడు మోహన్‌ రాజా జీవితంలో మరచిపోలేని రోజు. బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘తని ఒరువన్‌’ తెరకు వచ్చిన రోజు. ‘జయం’ రవి హీరోగా మోహన్‌ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై మంగళవారంతో మూడేళ్లు పూర్తయిన సందర్భంగా సీక్వెల్‌ అనౌన్స్‌ చేశారు మోహన్‌ రాజా. ‘‘నా లైఫ్‌లో ‘తని ఒరువన్‌’ ఓ ఆశీర్వాదం. మూడేళ్లయినా ఇప్పటికీ ఆ సినిమా గురించి ప్రశంసలు వస్తున్నాయి. ప్రేక్షకులు అంతగా ఇష్టపడి చూసిన సినిమాకు సీక్వెల్‌ తీయాలని ఉంది.
 

ఫస్ట్‌ పార్ట్‌లో హీరోగా నటించిన నా తమ్ముడు ‘జయం’ రవి సెకండ్‌ పార్ట్‌లోనూ నటిస్తాడు. ‘తని ఒరువన్‌’ కంటే ‘తని ఒరువన్‌ 2’ ఇంకా బాగుండేలా తీయడానికి ట్రై చేస్తాను’’ అని మోహన్‌రాజా పేర్కొన్నారు. కాగా ‘తని ఒరువన్‌’ తెలుగులో రామ్‌చరణ్‌ హీరోగా ‘ధృవ’ పేరుతో రీమేక్‌ అయిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement