
రామ్‌చరణ్, మోహన్ రాజా
రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత రామ్‌చరణ్ ఏ సినిమా కమిట్ అవ్వలేదు. ‘ఆచార్య’లో నటిస్తున్నారు కానీ ఆ సినిమాకి చిరంజీవి హీరో అని తెలిసిందే. మరి ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత చరణ్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారు? అనే ఆసక్తి ఆయన అభిమానుల్లో ఉంది. వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, తమిళ దర్శకుడు మోహన్ రాజా.. ఇలా చాలా పేర్లే వినిపించాయి. అయితే మోహన్ రాజాతోనే చరణ్ తదుపరి సినిమా ఉంటుందని తెలిసింది.
మోహన్ రాజా తెరకెక్కించిన ‘తని ఒరువన్’ని తెలుగులో ‘ధృవ’గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేశారు చరణ్. ఇప్పుడు ‘తని ఒరువన్’కి సీక్వెల్ తెరకెక్కించనున్నారు మోహన్ రాజా. చరణ్–మోహన్ రాజా చేయబోయేది ‘తని ఒరువన్’ సీక్వెలే అని టాక్. ఇదిలా ఉంటే.. చిరంజీవి హీరోగా మోహన్ రాజా మలయాళ ‘లూసీఫర్’ తెలుగు రీమేక్‌ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం వేసవికి పూర్తి కానుంది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో చరణ్–మోహన్ రాజా సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట.
Comments
Please login to add a commentAdd a comment