సౌత్ ఇండియా ప్రముఖ నటుడు మోహన్‌రాజ్ అనారోగ్యంతో కన్నుమూశాడు. ‘కిరిక్కాడాన్ జోస్’గా మలయాళంలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. 1989లో ‘కిరీదామ్’ సినిమాతో ఆయనకు మంచి పేరు వచ్చింది. తెలుగులో ఎక్కువగా బాలకృష్ణ, మోహన్‌బాబు, వెంకటేష్‌లతో సినిమాలు చేశాడు. ఈ క్రమంలో లారీ డ్రైవర్, సమరసింహారెడ్డి, అసెంబ్లీరౌడీ,నరసింహ నాయుడు,సోగ్గాడి పెళ్ళాం,బొబ్బిలి సింహం,అసెంబ్లీ రౌడీ,శివమణి వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆయన విలన్‌గా నటించారు. సుమారు 300కు పైగా సినిమాల్లో మోహన్‌రాజ్ మెప్పించారు.
గత నాలుగు రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న మోహన్‌రాజ్ తిరువనంతపురంలో చికిత్స తీసుకుంటుండగా వెంటిలేటర్‌పైనే ఆయన మరణించారు. ఈ విషయాన్ని మలయాళ నటుడు, దర్శకుడు, పి.దినేశ్ పనికర్ తెలిపారు. మోహన్‌రాజ్‌కు భార్య ఉషతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్న విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 21 మూవీస్.. అవి ఏంటంటే?
పార్కిన్సన్స్‌తో (పక్షవాతం) బాధపడుతున్న మోహన్‌రాజ్‌కు కొద్దిరోజుల క్రితం గుండె పోటు కూడా రావడంతో వెంటనే ఆయన్ను చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇంటికి తీసుకెళ్లమని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను తిరువనంతపురంలోని మరో ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా ఆయన మరణించారు. తెలుగులో మోహన్‌బాబు ‘శివశంకర్’ (2004) అనే చిత్రంలో ఆయన చివరిగా కనిపించారు. ఇందులో హీరోగా నటించారు. మోహన్‌రాజ్ మృతిపట్ల మలయాళ సినీ పరిశ్రమ సంతాపం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment