
కొత్త సినిమాలోకి అడుగుపెట్టడం పెట్టడమే ఫైట్ చిత్రీకరణలో పాల్గొన్నారు చిరంజీవి. మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న తాజా సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. తొలుత యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ సురేశ్ సెల్వరాజన్ రూపొందించిన సెట్‌లో జరుగుతున్న ఈ సినిమా యాక్షన్ సీక్వెన్సెస్‌ను శిల్వ స్టంట్ సమకూర్చుతున్నారు.
ఈ సినిమాకు ‘గాడ్‌ఫాదర్’, ‘కింగ్‌మేకర్’ అనే టైటిల్స్‌ను చిత్రయూనిట్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నిరవ్ షా ఛాయాగ్రాహకులు. ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాకాడ అప్పారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
Comments
Please login to add a commentAdd a comment