హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ కానుందా? | Vijay and Mohan Raja Meet For A Discussion | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 18 2018 10:12 AM | Last Updated on Wed, Apr 18 2018 10:12 AM

Vijay and Mohan Raja Meet For A Discussion - Sakshi

తమిళ సినిమా : హీరో, దర్శకుల హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ అయితే ఆ చిత్రానికి ఉండే క్రేజే వేరు. అలాంటి కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం తెరకెక్కడానికి రంగం సిద్ధం అవుతోందనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఇళయదళపతి విజయ్‌ ప్రస్తుతం ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ఆయన 62వ చిత్రం అవుతుంది. ఇందులో కీర్తీసురేశ్‌ నాయకిగా నటిస్తున్నారు. ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్‌పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 

విజయ్‌ తదుపరి చిత్రానికి దర్శకుడెవరన్న ప్రశ్న చాలా కాలంగానే ఆసక్తిగా మారింది. ఈ లిస్ట్‌లో పలు దర్శకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. చతురంగవేట్టై చిత్రం ఫేమ్‌ హెచ్‌.వినోద్‌ విజయ్‌ తదుపరి చిత్రానికి పని చేయనున్నారనే ప్రచారం జరిగింది. దర్శకుడు అట్లీ కూడా విజయ్‌ కోసం కథను రెడీ చేశారనే ప్రచారం తెరపైకి వచ్చినా, ఆయన తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ఇటీవలే వెల్లడించారు. తాజాగా దర్శకుడు మోహన్‌రాజా పేరు వైరల్‌ అవుతోంది. 

తనీఒరువన్, వూలైక్కారన్‌ వంటి సంచలన విజయాలను సాధించిన చిత్రాల దర్శకుడు మోహన్‌రాజా విజయ్‌ కోసం ఒక బలమైన ఇతివృత్తంతో కూడిన కథను రెడీ చేశారని టాక్‌. విజయ్‌ 63వ చిత్రానికి మోహన్‌రాజా దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్టు తాజా సమాచారం. విజయ్, మోహన్‌రాజా కాంబినేషన్‌లో ఇంతకుముందు తెరకెక్కిన వేలా యుధం సూపర్‌హిట్‌ అయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement