Velayudham
-
దళిత వర్గమే కానీ... రిజర్వేషన్లు మాత్రం వద్దన్నారు!
ఆమె రాజ్యాంగసభలోని సభ్యురాలైనప్పటికీ కుల ప్రాతిపదికన కేటాయించే రిజర్వేషన్‌ను వ్యతిరేకించారు. మహిళలకూ ప్రత్యేకమైన రిజర్వేషన్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఆమె మరెవరో కాదు.. రిజర్వేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన నాటి ఏకైక దళిత మహిళా రాజ్యాంగ సభ సభ్యురాలు దాక్షాయణి వేలాయుధన్. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ సభలోని మొత్తం 389 మంది సభ్యులలో 15 మంది మహిళలున్నారు. నాడు రాజ్యాంగ పరిషత్‌లో జరిగిన చర్చలలో ఒకరిద్దరు మహిళా సభ్యులు రిజర్వేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే వీరు మహిళలకు ఎలాంటి రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేయలేదు. జర్నలిస్ట్ నిధి శర్మ రచించిన పుస్తకం 'షీ ది లీడర్: ఉమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్’లో మహిళా రాజకీయ నేతల గురించి లోకానికి అంతగా తెలియని కథనాలను అందించారు. పుస్తకం ప్రారంభంలో 1947, ఆగస్టు 28న షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక నియోజక వర్గం అంశంపై చర్చిస్తున్నప్పుడు.. రిజర్వేషన్‌ను వ్యతిరేకించిన ఏకైక దళిత మహిళా సభ్యురాలు దాక్షాయణి వేలాయుధన్ అని పేర్కొన్నారు. నాడు సభలో దాక్షాయణి వేలాయుధన్ ఇలా అన్నారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ‘వ్యక్తిగతంగా నేను ఎటువంటి రిజర్వేషన్లకు అనుకూలంగా లేను. దురదృష్టవశాత్తూ బ్రిటీష్ సామ్రాజ్యవాదం మనపై కొన్ని మచ్చలు మిగిల్చింది. మనం హెచుతగ్గులను చూసి భయపడుతున్నాం. అందుకే ఈ అంశాలన్నింటినీ అంగీకరించవలసి వచ్చింది. ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపును తొలగించలేం. సీట్ల రిజర్వేషన్ కూడా ఒక రకమైన ప్రత్యేక ఎంపిక వంటిదే. అయినా మనం దీనిని సహించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది అవసరమైన పరిణామం అని మేం భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. దాక్షాయణి వేలాయుధన్ ఎవరు? దక్షిణాయణి వేలాయుధన్ 1912, జూలై 15న నేటి ఎర్నాకులం(కేరళ) జిల్లాలోని చిన్న ద్వీపమైన ముళవుకడ్లో జన్మించారు. ఆమె పులయ సమాజానికి చెందినవారు. కుల వ్యవస్థలో వీరి సమాజం అట్టడుగున ఉండేది. ఈ సమాజంలోని వారు వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు. అంటరానితనం కారణంగా వారు బహిరంగ రహదారులపై నడవడాన్ని కూడా నిషేధించారు. దీనికితోడు ఈ సమాజానికి చెందిన స్త్రీలు తమ శరీరపు పైభాగాన్ని దుస్తులతో కప్పుకోవడాన్ని నిషేధించారు. ఈ విధంగా పులయ సమాజానికి చెందిన మహిళలు ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దళితులకు సంబంధించిన కాయాల్ సమావేశం 1913లో కొచ్చిలో జరిగినప్పుడు వేలాయుధన్ కుటుంబసభ్యులతో పాటు తరలివచ్చారు. అక్కడ వారి సమాజానికి తీవ్రమైన అవమానాలు ఎదురయ్యాయి. ఇటువంటి సంఘటనలు వేలాయుధన్ జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. శాసనోల్లంఘన ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ వేలాయుధన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1945లో దాక్షాయణి కొచ్చిన్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున నామినేట్ అయ్యారు. ఈ కౌన్సిల్ ద్వారా 1946లో భారత రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు మరోవైపు ఆమె ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్‌సీఎఫ్)వారపత్రిక ‘జై భీమ్’లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వ్యాసాలు రాస్తూవుండేవారు. డాక్టర్ అంబేద్కర్‌ను విమర్శించడానికి కూడా ఆమె వెనుకాడలేదు. అంబేద్కర్ రాజకీయాలను, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక నియోజకవర్గాల కోసం ఆయన చేసిన డిమాండ్‌ను ఆమె తీవ్రంగా విమర్శించారు. దాక్షాయణి వేలాయుధన్ 1978 జూలై 20న తన 66 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: ఐదుగురు ప్రియురాళ్లు... సరిహద్దులు దాటి, చిక్కుల్లో పడి.. -
ఆత్మగౌరవ వజ్రాయుధం... దాక్షాయణి వేలాయుధం
రాజ్యాంగ రూపకల్పన ఒక మహాయజ్ఞంలా సాగింది. ఆనాటి రాజ్యాంగ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 299 కాగా, అందులో 15 మంది మహిళలు ఉన్నారు. వారిలో ఒకరైన దాక్షాయణి వేలాయుధం రాజ్యాంగ సభకు ఎంపికైన తొలి దళిత మహిళగా చరిత్రలో నిలిచిపోయారు. కొచ్చి (కేరళ)లోని ములవుకాడ్ అనే లంక గ్రామంలో పులయార్ కమ్యూనిటికీ చెందిన ఒక కుటుంబంలో 1912లో జన్మించింది దాక్షాయణి. పులయార్లు ప్రధానంగా వ్యవసాయకూలీలు. శ్రమదోపిడికి, అవమానాలకు గురయ్యేవాళ్లు. వాళ్ల చుట్టూ ఎన్నో ముళ్లకంచెలు ఉండేవి. ‘అందరూ నడిచే బాటలో నడవకూడదు’ ‘అందరూ వెళ్లే బావిలో నుంచి నీళ్లు తీసుకోకూడదు’ ‘ఖరీదైన దుస్తులే కాదు ఒక మాదిరి దుస్తులు కూడా ఒంటి మీద కనిపించకూడదు’... వంటివి. అయితే, దాక్షాయణి పుట్టిన కాలంలోనే ఒక ప్రశ్న కూడా పుట్టింది.‘అయ్యా! మేమూ మీలాగే మనుషులం కదా. మమ్మల్ని ఇలా ఎందుకు హీనంగా చూస్తున్నారు?’ అని అడిగింది ఆ ప్రశ్న.పులయార్ల సంస్కర్త అయ్యన్‌కాలీ ఉద్యమ గొంతు సవరించడానికి సిద్ధమవుతున్న కాలం అది. సాధారణంగా పులయార్ల ఇండ్లలో అమ్మాయి పుడితే అజ్కి, పుమల, చక్కి, కిలిపక్క.. అనే పేర్లు మాత్రమే పెట్టేవారు. అయితే ఒక అమ్మాయికి ‘దాక్షాయణి’ అని నామకరణం చేయడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. నామకరణ సరళిలో మార్పు తీసుకువచ్చింది. ‘ఆమె జీవితంలో ఎన్నో ఉద్యమాలు, ఎన్నో చారిత్రక అస్తిత్వాలు ఉన్నాయి’ అంటారు దాక్షాయణి కూతురు మీరా వేలాయుధం. ఆరోజుల్లో నిమ్నవర్గాలకు చెందిన పిల్లలు స్కూలు గడప తొక్కడం అనేది ఊహకు అందని విషయం. ఎన్నో ప్రతికూల పరిస్థితులు, అవమానాలను తట్టుకొని ఉన్నత చదువులు చదువుకుంది దాక్షాయణి. 1945లో కొచ్చి లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎంపికైంది. విశిష్టమైన రాజ్యాంగ నిర్మాణంలో భాగమై తన సమకాలీన తరానికి, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచింది దాక్షాయణి వేలాయుధం. -
హిట్ కాంబినేషన్ రిపీట్ కానుందా?
తమిళ సినిమా : హీరో, దర్శకుల హిట్ కాంబినేషన్ రిపీట్ అయితే ఆ చిత్రానికి ఉండే క్రేజే వేరు. అలాంటి కాంబినేషన్లో ఒక భారీ చిత్రం తెరకెక్కడానికి రంగం సిద్ధం అవుతోందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ఆయన 62వ చిత్రం అవుతుంది. ఇందులో కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తున్నారు. ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. విజయ్ తదుపరి చిత్రానికి దర్శకుడెవరన్న ప్రశ్న చాలా కాలంగానే ఆసక్తిగా మారింది. ఈ లిస్ట్‌లో పలు దర్శకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. చతురంగవేట్టై చిత్రం ఫేమ్ హెచ్.వినోద్ విజయ్ తదుపరి చిత్రానికి పని చేయనున్నారనే ప్రచారం జరిగింది. దర్శకుడు అట్లీ కూడా విజయ్ కోసం కథను రెడీ చేశారనే ప్రచారం తెరపైకి వచ్చినా, ఆయన తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ఇటీవలే వెల్లడించారు. తాజాగా దర్శకుడు మోహన్‌రాజా పేరు వైరల్ అవుతోంది. తనీఒరువన్, వూలైక్కారన్ వంటి సంచలన విజయాలను సాధించిన చిత్రాల దర్శకుడు మోహన్‌రాజా విజయ్ కోసం ఒక బలమైన ఇతివృత్తంతో కూడిన కథను రెడీ చేశారని టాక్. విజయ్ 63వ చిత్రానికి మోహన్‌రాజా దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్టు తాజా సమాచారం. విజయ్, మోహన్‌రాజా కాంబినేషన్లో ఇంతకుముందు తెరకెక్కిన వేలా యుధం సూపర్‌హిట్ అయ్యింది. -
మళ్లీ వేలాయుధం కాంబినేషన్!
చెన్నై: వేలాయుధం చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోలేరు. ముఖ్యంగా విజయ్ అభిమానులు అస్సలు మరువలేరు. అంత గ్రాండీయర్‌తో రూపొందిన భారీ చిత్రం అది. ఆ చిత్రానికి జయంరాజా దర్శకుడు (ఇటీవల మోహన్‌రాజాగా పేరు మార్చుకున్నారు). వేలాయుధం అప్పట్లో మంచి విజయం సాధించింది. ఈయన ఇటీవల తన సోదరుడు జయంరవి హీరోగా తెరకెక్కించిన తనీఒరువన్ పెద్ద విజయం సాధించింది. తెలుగులో రామ్ చరణ్ హీరోగా రీమేక్ కానుంది. సల్మాన్ ఖాన్ హీరోగా హిందీలో రీమేక్ కానున్న ఈ చిత్రానికి మోహన్‌రాజానే దర్శకత్వం వహించనున్నారు. అయితే సల్మాన్‌ఖాన్ వచ్చే ఏడాది ఆగస్టు వరకూ కమిటైన చిత్రాలో బిజీగా ఉండడంతో ఈలోగా మోహన్‌రాజా తమిళంలో మరో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా తనీఒరువన్ చిత్రం విపరీతంగా నచ్చేసిన కథానాయకుల్లో ఇళయదళపతి విజయ్ ఒకరు. అంతేకాదు వీరిద్దరూ ఇటీవల కలిసి ముచ్చటించుకున్నారని , ఆ సందర్భంగా విజయ్ తనీఒరువన్ లాంటి ఒక చిత్రం చేద్దాం అని మోహన్‌రాజాతో అన్నట్లు సమాచారం. అలాంటి సామాజిక స్పృహ ఉన్న కథను సిద్ధం చేయమని చెప్పినట్టు టాక్. అందుకోసం రచయితలు శుభ(జంట రచయితలు)లతో మోహన్‌రాజా చర్చించి కథను రెడీ చేయనున్నారని భోగట్టా. దీంతో వేలాయుధం చిత్ర కాంబినేషన్లో త్వరలో అంతకు మించిన చిత్రం వచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఇళయదళపతి అట్లీ దర్శకత్వంలో కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న కాక్కీ చిత్రంలో నటిస్తున్నారు.